Slap Day 2025: ప్రేమ వ్యతిరేకుల వారం ప్రారంభం.. స్లాప్ డే ఎలా జరుపుకుంటారు, ఆ రోజు ఏం చేస్తారో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేమను వ్యక్తపరచడానికి, గెలుచుకోవడానికి వాలెంటైన్ వీక్ ని ఎంతోమంది ప్రత్యేకంగా జరుపుకుంటారు.
అయితే, ప్రేమకు వ్యతిరేకంగా నిలిచే యాంటీ వాలెంటైన్ వీక్ గురించి మీకు తెలుసా?
యువతకు వాలెంటైన్ వీక్ ఎంత ముఖ్యమో, అదే విధంగా యాంటీ వాలెంటైన్ వీక్ కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రేమలో విజయవంతం కావలసిన అవసరం లేదు.
ప్రేమలో ఓడిపోయిన వారు, మోసపోయిన వారు, మనసుపోటు చెందిన వారు ఈ యాంటీ వాలెంటైన్ వీక్ ను జరుపుకుంటారు.
వివరాలు
యాంటీ వాలెంటైన్ వీక్ అంటే ఏమిటి?
ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే ముగిశాక, ఫిబ్రవరి 15 నుంచి యాంటీ వాలెంటైన్ వీక్ ప్రారంభమవుతుంది.
ఈ వారం రోజుల్లో స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే వంటి ప్రత్యేకమైన రోజులు వస్తాయి.
ఫిబ్రవరి 21 వరకు ఈ వారం కొనసాగుతుంది. ప్రేమలో మోసపోయిన వారు, రిలేషన్‌షిప్ లో నరకాన్ని అనుభవించిన వారు, ప్రేమ పట్ల ఆశభంగానికి గురైన వారు ఈ యాంటీ వాలెంటైన్ వీక్ ను ఆస్వాదిస్తారు.
ఇందులోని మొదటి రోజైన స్లాప్ డే చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
వివరాలు
స్లాప్ డే ఉద్దేశ్యం
ఈ రోజును జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం— ప్రేమలో మోసపోయిన వారు తమ మానసిక వేదన నుంచి విముక్తి పొందడం.
తమను మోసం చేసిన వారి నుండి భావోద్వేగాలను పూర్తిగా తొలగించుకోవడానికి ఇది ఒక చిహ్నంగా మారింది.
భవిష్యత్తులో కొత్త జీవితం ప్రారంభించేందుకు, గతాన్ని పూర్తిగా మర్చిపోవడానికి ఈ రోజు సహాయపడుతుంది.
ఈరోజు ద్వారా మనసులోని కోపాన్ని, బాధను మరియు ద్వేషాన్ని పోగొట్టుకుని, మళ్లీ సంతోషంగా జీవించే మార్గాన్ని ఎంచుకోవచ్చు.
వివరాలు
స్లాప్ డే ను ఎలా జరుపుకోవాలి?
స్లాప్ డే అంటే శారీరకంగా ఎవరికైనా చెంప దెబ్బ కొట్టడం అని అనుకోవద్దు.
అసలు ఈ రోజు లక్ష్యం అలా చేయడమే కాదు. నిజంగా తమ మాజీ ప్రియులను కొట్టడం అనేది సమాధానం కాదు.
బదులుగా, మన మనసులోని బాధను, కోపాన్ని, అసంతృప్తిని పూర్తిగా వదిలిపెట్టడం అవసరం.
"మనల్ని కాదనుకున్న వారికి మనం చూపాల్సిన అసలైన శిక్ష - వారు ఊహించనంత గొప్ప జీవితం గడపడం" అనే తత్వాన్ని అనుసరించాలి.
ప్రేమలో విఫలమైన ప్రతి ఒక్కరూ ఈ రోజును సరిగ్గా ఉపయోగించుకొని, కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధం కావాలి.