Weight lose tips: నిద్రలో కూడా బరువు తగ్గుతారని మీకు తెలుసా? అదెలాగో తెలుసుకోండి
lose weight with Sleep: ఈ రోజుల్లో ఊబకాయం తీవ్రమైన సమస్యగా మారింది. ఈ క్రమంలో బరువు పెరగడంపై అనేకమంది ఆందోళన చెందుతుంటారు. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి కొందరు డైటింగ్ చేస్తుంటే మరికొందరు యోగా, వ్యాయామాన్ని ఎంచుకుంటారు. డైట్, వ్యాయామం ఎంత పర్ఫెక్ట్‌గా పాటించినా కొందరు బరువు తగ్గకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడంతో పాటు మీ నిద్ర (Sleep) విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే, సులభంగా బరువు తగ్గుతారని మీకు తెలుసా? అయితే ఎలా నిద్రపోతే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర
మీరు ప్రతిరోజూ కనీసం 7 నుంచి 9 గంటల వరకు మంచి నిద్రను పొందినట్లయితే, అది శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీవక్రియ వేగంగా మారినప్పుడు, ఇది వేగంగా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. తక్కువ నిద్ర కారణంగా, శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఆకలిని ప్రేరేపించే హార్మోన్ గ్రెలిన్ ఉత్పత్తిని పెంచుతుంది. నిద్ర లేకపోవడం వల్ల, మెదడు ఆహార కోరికలను నియంత్రించలేకపోతుంది. ఫలితంగా ఎక్కువ కేలరీలు తినడం ప్రారంభిస్తారు. ఇది బరువు పెరుగుటకు దారితీస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి నిద్ర చాలా ముఖ్యం.
1. కరెక్ట్ స్లీపింగ్ పొజిషన్
కాళ్లను చాచి వెనుకవైపు పడుకోవడం అనేది బరువు తగ్గడానికి ఉత్తమ మార్గం. కాళ్లు మడిచి, పొట్టపై ముడుచుకుని నిద్రపోకండి. మీరు అవసరమైతే మీ కాళ్ళు తెరిచి మీ ఎడమ లేదా కుడి వైపున తిరిగి కూడా పడుకోవడం వల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉంది. 2. చీకటిలో నిద్ర మనం నిద్రపోతున్నప్పుడు మెలటోనిన్ హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్‌ను సృష్టిస్తుందని, ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మీరు చీకటిలో నిద్రపోతే, శరీరం ఎక్కువ మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
3. మొబైల్‌కు దూరంగా ఉండండి
మీరు నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ లేదా ఇతర గాడ్జెట్‌లను ఉపయోగిస్తే, వాటి నుంచి వెలువడే బ్లూ లైట్ స్లీప్ హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలలో నిరూపించబడింది. మెటాలోనిన్ ఉత్పత్తి తగ్గితే ఆకలి పెరుగుతుంది. జీవక్రియ తగ్గుతుంది. దీని కారణంగా బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతారు.అందుకే రాత్రి పడుకునే ముందు వరకు మొబైల్ ఉపయోగించకండి. 4. నిద్రపోయే ముందు చమోమైల్ టీ తాగండి చమోమిలే టీ కూడా మంచి నిద్ర, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చమోమిలే టీ శరీరంలో గ్లైసిన్ స్థాయిని పెంచుతుంది. ఇది నిద్రను కలిగిస్తుంది. అందుకేనిద్రపోయే ముందు 1 కప్పు వేడి చమోమిలే టీ తాగండి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.