World Record : ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు ఆమెదే.. 2 మీటర్లతో రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 20 ఏళ్లుగా కృషి చేస్తూ అతిపొడవైన జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారు.
ఈ మేరకు 2 మీటర్ల పొడవైన జుట్టు కలిగిన స్మితా శ్రీవాస్తవ, అత్యంత పొడవైన వెంట్రుకలు గల ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
46ఏళ్ల స్మితా, 14వ ఏటా నుంచే తన జుట్టును పెంచుతున్నారు. ఈ విషయంలో తన తల్లే స్ఫూర్తినిచ్చిందని స్మితా శ్రీవాత్సవా చెప్పారు.
తన జుట్టు "ఆరోగ్యకరమైన పెరుగుదల" తన జన్యువు బలమేనని స్మితా చెప్పుకొచ్చారు. ఈ మేరకు 1980 దశకాల నుంచి"పొడవైన, అందమైన జుట్టు"ను కలిగి ఉన్నట్లు వివరించారు.
అయితే ఈ విషయంలో తాను బాలీవుడ్ నటీమణుల శైలిని అనుకరించేందుకు ప్రయత్నించానన్నారు.
Details
అందుకు 3 గంటల సమయం అవసరం : స్మితా శ్రీవాస్తవ
ఇదే సమయంలో భారతీయ సంస్కృతిలో భాగంగా దేవతలు సాంప్రదాయకంగా చాలా పొడవాటి జుట్టు కలిగి ఉంటారని ఆమె గుర్తు చేశారు.
మన సమాజంలో జుట్టు కత్తిరించుకోవడాన్ని అశుభంగా భావిస్తారని, అందుకే మహిళలు జుట్టు పెంచుకునేవారని స్మిత వివరించారు.
మరోవైపు పొడవాటి జుట్టు మహిళల అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుందన్నారు. సాధారణంగా వారానికి రెండుసార్లు జుట్టును కడుక్కోవాలని సూచిస్తున్నారు.
ఇందుకు మూడు గంటల వరకు సమయం అవసరమని, వాషింగ్, డ్రైయింగ్, డిటాంగ్లింగ్, స్టైలింగ్‌తో ఉంటాయని తెలిపారు.
ఆరోగ్యకరమైన జుట్టును సాధించేందుకు కావాల్సిన చిట్కాలను చెప్తానన్నారు. తాను కలలు కనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ దక్కించుకోవడం ఆనందంగా ఉందని స్మితా అన్నారు.
తాను జుట్టును ఎప్పటికీ కత్తిరించనని, ఇది మరింత పెరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.