LOADING...
Besan Barfi: లోపల సాఫ్ట్, బయట రిచ్ ఫ్లేవర్.. ఇంట్లో 'బేసన్ బర్ఫీ' ఇలా తయారు చేయండి! 
లోపల సాఫ్ట్, బయట రిచ్ ఫ్లేవర్.. ఇంట్లో 'బేసన్ బర్ఫీ' ఇలా తయారు చేయండి!

Besan Barfi: లోపల సాఫ్ట్, బయట రిచ్ ఫ్లేవర్.. ఇంట్లో 'బేసన్ బర్ఫీ' ఇలా తయారు చేయండి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2025
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వీట్స్ను చాలామందికి ఇష్టమే. అయితే నోరు ఎప్పుడూ కొత్త రుచిని కోరుతూనే ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇన్స్టంట్ బేసన్ బర్ఫీ రెసిపీ సూపర్ ఆప్షన్. శనగపిండి, పంచదార కాంబోలో తయారు చేసే ఈ బర్ఫీ, సులువుగా ఇంట్లో చేసుకోవచ్చు. చిన్నప్పటి నుండి పెద్దలవరకు అందరికీ ఇష్టపడే ఈ స్వీట్, ఫ్రెండ్స్ లేదా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు సర్ప్రైజ్ ఇచ్చేందుకు కూడా పర్ఫెక్ట్.

Details

కావాల్సిన పదార్థాలు 

పంచదార - 400 గ్రాములు కుంకుమపువ్వు - 2 చిటికెడ్లు నెయ్యి - 200 గ్రాములు శనగపిండి - 200 గ్రాములు పచ్చికోవా - 50 గ్రాములు యాలకుల పొడి - 2 టీ స్పూన్లు డ్రైఫ్రూట్స్ - కొద్దిగా

Details

 తయారీ విధానం 

1. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 400 గ్రాముల పంచదార, సరిపడా నీళ్లు వేసి, హై ఫ్లేమ్‌లో కరిగించాలి. పంచదార కరిగి తీగ పాకం వచ్చే వరకు ఉంచండి. 2. పాకం వచ్చిన తర్వాత 2 చిటికెడు కుంకుమపువ్వు కలపండి మరియు స్టవ్ ఆఫ్ చేయండి. 3. మరో పాన్‌లో 200 గ్రాముల నెయ్యి వేయి, కరిగిన తర్వాత 200 గ్రాముల శనగపిండి యాడ్ చేసి, లో ఫ్లేమ్‌లో 20 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. 4. శనగపిండి వేగి, నురుగు వస్తే 50 గ్రాముల పచ్చికోవా, 2 టీ స్పూన్ల యాలకుల పొడి కలపండి.

Advertisement

Details

 తయారీ విధానం 1/2

5. రెడీ చేసిన పంచదార పాకం మిశ్రమంలో వేసి, మీడియం ఫ్లేమ్‌లో 2 నిమిషాలు కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాల పాటు కలపండి. 6. ఒక మౌల్డ్ లేదా ప్లేట్‌లో బటర్ పేపర్ వేసి, డ్రైఫ్రూట్స్ చల్లండి. మిశ్రమాన్ని పైగా పోసి 3 గంటల పాటు పక్కన ఉంచండి. 7. 3 గంటల తర్వాత మౌల్డ్ చేసి కట్ చేయండి.

Advertisement