NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Pappu Chakodilu: సంక్రాంతికి స్పెషల్.. పిల్లలకి ఇష్టమైన క్రిస్పీ పప్పు చకోడీల రెసిపీ
    తదుపరి వార్తా కథనం
    Pappu Chakodilu: సంక్రాంతికి స్పెషల్.. పిల్లలకి ఇష్టమైన క్రిస్పీ పప్పు చకోడీల రెసిపీ
    సంక్రాంతికి స్పెషల్.. పిల్లలకి ఇష్టమైన క్రిస్పీ పప్పు చకోడీల రెసిపీ

    Pappu Chakodilu: సంక్రాంతికి స్పెషల్.. పిల్లలకి ఇష్టమైన క్రిస్పీ పప్పు చకోడీల రెసిపీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 13, 2025
    01:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సంక్రాంతి పండుగ అంటే అనేక రకాల పిండివంటలతో కూడిన ఆనందం. అందులో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికి ఇష్టమైన వంటకం పప్పు చకోడీలు.

    ఈ ప్రత్యేక వంటకం సంక్రాంతి పండుగలో పక్కా స్నాక్స్‌గా అనిపిస్తుంది. కనుక మీ కుటుంబం అంతా ఈ చక్కటి రెసిపీతో ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నించండి.

    కావాల్సిన పదార్థాలు

    నూనె, బియ్యపు పిండి, శెనగపిండి, పసుపు, ఉప్పు, కారం, వాము పొడి, శెనగపప్పు

    పప్పు చకోడీలు తయారీ విధానం

    1)ముందుగా ఒక పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి.

    2. నూనె వేడెక్కిన తర్వాత అందులో బియ్యపు పిండి వేయించాలి. తర్వాత వేరే గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి.

    Details

    పిండి వదులుగా కాకుండా చూసుకోవాలి

    3. పచ్చి శెనగపప్పును కనీసం రెండు గంటలు నానబెట్టండి. ఆ తర్వాత ఆ పప్పును నీటితో బాగా శుభ్రపరచి, తడి ఆరిపోయేలా కాటన్ క్లాత్‌లో ఆరబెట్టండి.

    4. పిండి చల్లారిన తర్వాత, పసుపు, ఉప్పు, కారం, వాము పొడిని చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోండి.

    5. కలిపిన పిండి బాగా మెత్తగా అయ్యేంత వరకూ నీళ్ళు వేసి ముద్దలా చేసుకోండి. పిండి వదులుగా కాకుండా చూసుకోండి.

    6. చిటికెడు నూనె చేతికి రాసుకుని, పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని, చపాతీ పీటపై రోల్ చేసి సన్నగా పొడిగించండి.

    Details

    కరకరలాడే పప్పు చకోడీలు  

    7. రోల్ చేసిన పిండి పై శెనగపప్పుతో రోల్ చేయండి. ఇది మధ్యలో పప్పులు అతికిపోవడానికి సాయపడుతుంది.

    8. ఇక, ఫ్రైయింగ్ పాన్‌లో నూనె వేడి చేసి, చకోడీలను వేసి డీప్ ఫ్రై చేయండి. కరకరలాడే పప్పు చకోడీలు రెడీ!

    ఈ పప్పు చకోడీలు, సంక్రాంతి పండుగలో పిల్లలు, పెద్దలు అందరినీ సంతోషపరచడంతో పాటు, మంచి స్పెషల్ టేస్ట్‌తో ఉంటాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంక్రాంతి స్పెషల్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    సంక్రాంతి స్పెషల్

    Sankranti 2025 Recipes : సంక్రాంతి స్పెషల్.. అరిసెలు విరగకుండా టేస్టీగా రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    Sankrathi Special Sakinalu: కరకరలాడే తెలంగాణ స్పెషల్ సకినాల తయారీ విధానం  లైఫ్-స్టైల్
    Sankranti Muggulu: సంక్రాతి రోజు ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా? లైఫ్-స్టైల్
    Sankranti: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగే ముక్కనుమ విశేషాలివే! ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025