NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Sravana Masam 2023: నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం; ఈ నెల విశిష్టతను తెలుసుకుందాం
    తదుపరి వార్తా కథనం
    Sravana Masam 2023: నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం; ఈ నెల విశిష్టతను తెలుసుకుందాం
    నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం; ఈ నెల విశిష్టతను తెలుసుకుందాం

    Sravana Masam 2023: నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం; ఈ నెల విశిష్టతను తెలుసుకుందాం

    వ్రాసిన వారు Stalin
    Jul 04, 2023
    10:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హిందూ క్యాలెండర్‌లో శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఆధ్యాత్మికత, సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో ఈ నెల దోహదపడుతుంది.

    ఈ ఏడాది శ్రావణమాసం మంగళవారం (జులై 4)న ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెలకు సంబంధించిన విశిష్టత, ఎలాంటి దైవిక కార్యక్రమాలు చేస్తారో ఓసారి తెలుసుకుందాం.

    తెలుగు సంవత్సరాది ప్రకారం శ్రావణ మాసాన్ని 5వ నెలగా భావిస్తారు. ఈ నెలలోని పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి చాలా సమీపంలో ఉంటాడు కాబట్టి, దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది.

    మహావిష్ణువు జన్మనక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కావడంతో ఈ మాసం విశిష్టత మరింత పెరిగింది.

    శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షం కోసం భక్తులు నియమ నిష్టలతో పూజలు చేస్తారు.

    శ్రావణ మాసం

    నెల పొడవునా ఆ మూడు రోజులు వ్రతాలు, పూజలు

    శ్రావణ మాసంలో శివపార్వతులను భక్తులు ప్రత్యేకంగా కొలుచుకుంటారు.

    సముద్ర మంథనం సమయంలో వచ్చిన విషం మొత్తాన్ని శివుడు మింగి విశ్వాన్ని రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసంలో శివుడు, పార్వతిని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు.

    శ్రావణ మాసంలో సోమవారం, మంగళవారం, శుక్రవారాలను ప్రత్యేకంగా జరుపుకుంటారు.

    శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు శివపూజను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.

    అలాగే మంగళవారం పార్వతీ దేవీ అనుగ్రహం కోసం మంగళగౌరీ వ్రతాన్ని చేస్తారు.

    సిరిసంపదులు కలగాలని ఈ నెలలోని ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి కటాక్షం కోసం వరలక్ష్మీవ్రతాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

    ఈ పూజల చేయడం ద్వారా లక్ష్మీదేవి మన కోర్కెలను వింటుందని పురాణాలు చెబుతున్నాయి.

    శ్రావణ మాసం

    ఈ మాసంలో ప్రతిరోజు ఒక పండగే

    శ్రావణ మాసం నెలపొడవునా సోమవారం, మంగళవారం, శుక్రవారాల్లో భక్తులు చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు.

    శ్రావణ మాసంలో ఉపవాసం చేయడం ద్వారా ఆధ్యాత్మిక భావన పెరగడంతో పాటు స్వీయ క్రమశిక్షణ కూడా అలవడుతుంది.

    శ్రావణ మాసం సమయంలో భక్తులు శివాలయాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు, అభిషేకాలు చేస్తారు.

    ఈ పూజల్లో ప్రత్యేకంగా బిల్వ ఆకులు, నీరు, పాలు, తేనె, పెరుగు, విభూతి ఉపయోగిస్తారు.

    ముఖ్యంగా మహిళలు ఈ మాసంలోని ప్రతిరోజును ఒక పండగలా జరుపుకుంటారు. జులై 4న ప్రారంభమైన శ్రావణ మాసం ఆగస్టు 31తో ముగుస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రుడు
    హిందువులు

    తాజా

    Stock Market: కాల్పుల విరమణ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ కొత్త అప్డేట్.. డబ్బులు ఖాతాల్లో పడాలంటే ఈ విధంగా చేయండి!  ఆంధ్రప్రదేశ్
    Virat Kohli: టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ 5 టాప్ ఇన్నింగ్స్ ఇవే! విరాట్ కోహ్లీ
    Operation Sindoor:  ఉగ్రవాదం నిర్మూలానికి చేపట్టిన ఆపరేషన్ విజయవంతం : త్రివిధ దళాధిపతులు ఆపరేషన్‌ సిందూర్‌

    చంద్రుడు

    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం శాస్త్రవేత్త
    ఆర్టెమిస్ 2 మిషన్ కోసం సిద్దంగా ఉన్న నాసా SLS రాకెట్ నాసా
    చంద్రుడు ధూళితో సౌర ఘటాలను తయారు చేయనున్న జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ గ్రహం
    అరుదైన కలయికలో కనిపించనున్న బృహస్పతి, శుక్రుడు, చంద్రుడు గ్రహం

    హిందువులు

    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి తిరుమల తిరుపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025