Page Loader
Happy Ram Navami 2025: మీ ప్రియమైనవారికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలను చెప్పెయండిలా.. మీకోసం కొన్ని బెస్ట్ విషెస్..
మీ ప్రియమైనవారికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలను చెప్పెయండిలా.. మీకోసం కొన్ని బెస్ట్ విషెస్..

Happy Ram Navami 2025: మీ ప్రియమైనవారికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలను చెప్పెయండిలా.. మీకోసం కొన్ని బెస్ట్ విషెస్..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

త్రేతాయుగంలోని వసంత ఋతువు, చైత్ర శుద్ధ నవమి రోజున, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించినట్లు అనేక పురాణాలు పేర్కొంటున్నాయి. పద్నాలుగేళ్ల అరణ్యవాసం అనంతరం అయోధ్య చేరుకున్న శ్రీరాముడికి పట్టాభిషేకం కూడా అదే చైత్ర శుద్ధ నవమి రోజున జరిగిందని విశ్వసిస్తున్నారు. ఈ రోజు (ఏప్రిల్ 06) శ్రీరామ నవమి. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నవమి రోజున భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు తరలివస్తారు. అదేవిధంగా భద్రాచలంలో ఈ రోజు సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్యాణ మహోత్సవం ఎంతో ప్రసిద్ధి పొందింది.

వివరాలు 

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

శ్రీరాముని నామస్మరణం వల్ల భక్తుల సమస్త కష్టాలు తొలగిపోతాయని, సంపద, ఆరోగ్యం వృద్ధి చెందుతాయని నమ్మకం. ఈ పవిత్రమైన శ్రీరామ నవమి రోజున మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి, మీ కోసం కొన్ని అందమైన శుభాకాంక్షలు: శ్రీరామ రామ రామేతి.. రమేరామేమనోరమే.. సహస్రనామ తత్తుల్యం.. రామనామ వరాననే.. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శుభప్రదమైన శ్రీరాముని జన్మదినం, శ్రీరామ నవమి మీకు శుభకరంగా, ఆనందకరంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీరామ నవమి శుభాకాంక్షలు! పట్టాభి రామునికి ప్రణామం.. అయోధ్య రామునికి వందనం.. పాప విమోచకునికి జయవందనం.. అందాల దేవునికి హృదయమందిరం.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

వివరాలు 

మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

శ్రీ రాఘవం దశరథానందనం..సీతాపతిం రఘు వంశ తిలకం..రత్నదీపం,కమలనేత్రం, విశాల హృదయ రామాన్ని మనస్సారా స్మరించుదాం. శ్రీరామ నవమి శుభాకాంక్షలు! శుద్ధబ్రహ్మ పరాత్పర రామా.. కాలాత్మక పరమేశ్వర రామా.. శేషతల్ప సుఖనిద్ర రామా.. భక్తుల ప్రార్థనలకు ప్రతిస్పందించే రామా.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు! రామా, రామభద్రా, రామచంద్రా అని నిత్యం జపించేవారు,పాపరహితులై, భోగ మోక్షాలను సాదిస్తారు. శ్రీరామ నవమి శుభాకాంక్షలు! ఆదౌ రామ తపోవనాగమనమ్.. హత్వా మృగం కాంచనం.. వైదేహీ హరణం, జటాయు మరణం, సుగ్రీవాభిషేకం.. వాలీ నిగ్రహణం, సముద్రతరణం, లంకాపురి దహనం..కుంభకర్ణ, రావణ సంహారం..యే తద్ది రామాయణం! శ్రీరామ నవమి శుభాకాంక్షలు! శ్రీరాముని ఆశీస్సులు ఎప్పుడూ మీ కుటుంబంపై ఉండాలి. శ్రీరామ నవమి శుభాకాంక్షలు!