
Sri Ramanavami Recipes: శ్రీరామనవమి స్పెషల్ స్వీట్.. సింపుల్‌గా 'కొబ్బరి బూరెలు' తయారు చేసే విధానం!
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీరామనవమి పండగను గ్రామాల్లో, పట్టణాల్లో ఎంతో వైభవంగా శ్రీరామ కళ్యాణోత్సవాలను నిర్వహిస్తారు. ఈ పండుగ కోసం ఎన్నిరకాలైన నైవేద్యాలను దేవునికి ఇష్టంగా నివేదిస్తారు. అయితే మీరు కూడా ఏ ప్రసాదాలను తయారు చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే కొబ్బరి బూరెలు ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇవి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా, తక్కువ సమయంతో తయారు చేయడానికి వీలు ఉంటుంది.
Details
కొబ్బరి బూరెలు రెసిపీ
కావలసిన పదార్థాలు మినప్పప్పు - ఒక కప్పు బియ్యప్పిండి - రెండు కప్పులు పచ్చి కొబ్బరి తురుము - రెండు కప్పులు నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత జీడిపప్పు పలుకులు - గుప్పెడు
Details
తయారీ విధానం
1.మినప్పప్పును మిక్సీలో వేసి పొడిగా తయారు చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 2.గిన్నెలో ఉప్పు వేసి నీళ్లు కలిపి గంటసేపు నానబెట్టాలి. 3.బెల్లాన్ని కరగబెట్టి అందులో కొబ్బరి తురుము వేసి కలపాలి. 4.15 నిమిషాల పాటు బాగా కలిపాక, తరిగిన జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేసి కొద్దిసేపు కలపాలి. 5.మిశ్రమం దగ్గరపడిన తర్వాత స్టవ్ కట్టేసి ఇందులో రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి వేసి కలపాలి. 6.చల్లారిన తర్వాత లడ్డూలా చుట్టుకోవాలి. 7.నానబెట్టిన మినప పిండిలో కొంత నీళ్లు పోసి కాస్త పలుచగా చేసుకోవాలి. 8.స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచేసి,కొబ్బరి లడ్డులను మినప పిండిలో ముంచి నూనెలో వేయించాలి. 9.బూరెలు ఎర్రగా, క్రిస్పీగా మారే వరకు వేయిస్తే సరిపోతుంది