NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Star Fruit: స్టార్ ఫ్రూట్ తింటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలిస్తే షాక‌వుతారు..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Star Fruit: స్టార్ ఫ్రూట్ తింటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలిస్తే షాక‌వుతారు..!
    స్టార్ ఫ్రూట్ తింటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలిస్తే షాక‌వుతారు..!

    Star Fruit: స్టార్ ఫ్రూట్ తింటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలిస్తే షాక‌వుతారు..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2025
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మార్కెట్‌లో మనకు ఎన్నో రకాల వెరైటీ పండ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది ఈ పండ్లను కొని తినడానికి ఆసక్తి చూపుతున్నారు.

    అలాంటి పండ్లలో స్టార్ ఫ్రూట్ కూడా ఒకటి.ఇది నక్షత్ర ఆకారంలో ఉండి, పసుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

    ఈ పండ్ల తియ్యదనం కారణంగా,చాలామంది ఈ పండును తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తారు.

    అయితే,స్టార్ ఫ్రూట్ ఆరోగ్యపరంగా మనకు ఎన్నో లాభాలను అందిస్తుంది.

    దీన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

    మన శరీరంలోని అనేక అవయవాలకు రక్షణ కల్పించడంలో ఈపండు అద్భుతంగా పనిచేస్తుంది.

    ఇవి రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే మనం అనేక పోషకాలు కూడా పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

    వివరాలు 

    అధికంగా ఫైబర్ 

    స్టార్ ఫ్రూట్ 100 గ్రాముల మేర తీసుకుంటే మనకు సుమారు 31 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి.

    ఈ పండ్లు తియ్యగా ఉండినా క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలని కోరుకునే వారికి ఈ పండ్లు ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు.

    ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటది,అందువల్ల వీటిని తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది.

    ఎక్కువ సేపు ఆకలి వేయదు,దీంతో తీసుకునే ఆహార శాతం తగ్గుతుంది.ఫలితంగా అధిక బరువు తగ్గిపోతుంది.

    100 గ్రాముల స్టార్ ఫ్రూట్‌లో సుమారు 2.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

    ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్,అసిడిటీ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది.

    వివరాలు 

    రోగ నిరోధక శక్తికి 

    స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది.ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది,దాంతో సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.

    దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.ఇంకా,ఈ పండ్లలోని విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, చర్మం పగలకుండా ఉంటుంది.

    మెదడు యాక్టివ్‌గా మారుతుంది

    స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది.ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

    దీనితో పాటు కళ్ళను సంరక్షిస్తుంది,కంటి చూపు మెరుగు పడటానికి సహాయం చేస్తుంది.

    ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కళ్లలో శుక్లాలు రాకుండా చూసుకోవచ్చు, కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

    ఇందులోని విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది,దీనివల్ల మెదడు ఉత్తేజకరంగా మారి యాక్టివ్‌గా పనిచేస్తుంది,ఉత్సాహంగా ఉంటుంది.

    వివరాలు 

    మెటబాలిజం పెరుగుతుంది 

    నాడీ మండల వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది, నరాల బలహీనత తగ్గుతుంది. మెడ, భుజం నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

    స్టార్ ఫ్రూట్‌లోని విటమిన్ బి6 శరీరమెటబాలిజంనుపెంచుతుంది.అందువల్ల క్యాలరీలు వేగంగా ఖర్చయ్యి కొవ్వు తగ్గిపోతుంది .

    ఈ పండ్లలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది,ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.

    రక్త నాళాల్లోని అడ్డంకులను ,హైబీపీ ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    హార్ట్ ఎటాక్ రాకుండా చూడటానికి సహాయం చేస్తుంది. స్టార్ ఫ్రూట్‌లో మెగ్నిషియం కూడా ఉంటుంది, ఇది నిద్రను ప్రోత్సహిస్తుంది.

    రాత్రి పూట ఈ పండ్లను తినడం వలన నిద్ర బాగా పడుతుంది.

    అలాగే, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాలి పిక్కలు పట్టుకోవడం వంటి సమస్యలు ఉన్నవారికి ఈ పండ్లు ఉపశమనం అందిస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత.. పంజాబ్
    Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దోపిడీ.. 59 కిలోల బంగారం గల్లంతు! కర్ణాటక
    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు  ఐఐటీ బాంబే

    జీవనశైలి

    Health Benefits Of Amla Juice: ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..! లైఫ్-స్టైల్
    Blue Tea: బరువు తగ్గి, యవ్వనంగా కనిపించేందుకు ఈ స్పెషల్ బ్లూ టీ బెస్ట్.. లైఫ్-స్టైల్
    Claim Settlement: బీమా క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో జాగ్రత్తలు.. మీ హక్కులను ఎలా పొందాలంటే? లైఫ్-స్టైల్
    Blueberry Health Benefits: బ్లూ బెర్రీస్ ప్రతిరోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలుసా...  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025