
Rose Day Wishes: వాలెంటైన్స్ వీక్ ప్రారంభం.. మీ ప్రేమను వ్యక్తపరచేందుకు అందమైన కవితలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫిబ్రవరి నెల సెంటిమెంట్‌తో కూడిన అత్యంత రొమాంటిక్ మాసం. వాలెంటైన్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 7న రోజ్ డే జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు, దంపతులు ఒకరికొకరు గులాబీలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఎర్ర గులాబీలు ప్రేమకు సంకేతమని భావిస్తారు. ప్రేమను వ్యక్తపరిచేందుకు గులాబీ పువ్వు మాత్రమే కాకుండా ఒక అందమైన ప్రేమ కవిత, ఫోన్ మెసేజ్, లేదా వాట్సాప్ స్టేటస్ ద్వారా కూడా మన భావాలను తెలియజేయొచ్చు.
Details
ప్రేమికుల కోసం ప్రత్యేక రోజ్ డే శుభాకాంక్షలు
1. ప్రేమకు ప్రతీక గులాబీ గులాబీ పువ్వు అందమైన చిరునవ్వులాంటిది ఆ చిరునవ్వు నీ పెదాలపై ఎప్పుడూ వికసిస్తూ ఉండాలని కోరుకుంటూ! 2. అందమైన అమ్మాయికి ప్రేమతో గులాబీలాంటి అందమైన నీకోసం నేను ఎన్నో గులాబీలు అందిస్తాను నీవు ప్రతి క్షణం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి క్షణం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను! 3. నా ప్రేమకు గుర్తుగా నా హృదయాన్ని నీ హృదయంతో జోడించేందుకు ఈ సంతోషాన్ని ప్రేమను ఈ అందమైన ఎర్ర గులాబీతో తెలియజేస్తున్నాను!
Details
4. నీకోసం ప్రత్యేక గులాబీలు
అత్యంత అందమైన గులాబీలు నీకోసమే ఈ గులాబీని తీసుకుంటే నా ప్రేమ అంగీకరించినట్టే అదే జరిగితే నీ కోసం ఆకాశం నుంచి గులాబీల వర్షం కురిపిస్తాను! 5. నా ప్రేమ సందేశం ఈ క్షణం నా గుండె ప్రేమతో నిండి పోయింది ఈ సమయం నా ప్రేమతో పొంగిపోతోంది ఈ గులాబీని కేవలం గులాబీగా భావించవద్దు ఇది నా ప్రేమను నీ వరకు తీసుకొచ్చే అందమైన సందేశం! 6. నా గుండెను గులాబీగా మార్చేశాను నా ప్రేమను నీకెలా పంపాలి? ఈ గులాబీలో నా ప్రేమను నింపేశాను నా గుండెను గులాబీగా మార్చేశాను ఈ గులాబీలో నిక్షిప్తమైన నా ప్రేమను స్వీకరించు!
Details
7. నీ హృదయాన్ని గులాబీలతో నింపాలని ఉంది
ఈ రోజు నీ హృదయాన్ని గులాబీలతో నింపేయాలని ఉంది నీపై నా ప్రేమనంతా కురిపించాలని ఉంది నీ ప్రేమలో మొత్తం ప్రపంచాన్ని మరచిపోవాలని ఉంది 8. నువ్వే వికసించే గులాబీ ఈ లోకంలో నీలా అందంగా ఉన్నది ఈ ఎర్ర గులాబీ మాత్రమే ఈ ఎర్ర గులాబీతో నా ప్రేమను నీకు పంపిస్తున్నాను!