
hair care: వేసవిలో రోజూ షాంపూ మానేయండి..లేకపోతే జుట్టు రాలే ప్రమాదం!
ఈ వార్తాకథనం ఏంటి
వేసవిలో కేవలం చర్మం మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా తీవ్రమైన ప్రమాదం ఉంటుంది.
వేడి, చెమట, గాలిలోని మురికి వల్ల జుట్టు రాలటం, చుండ్రు, పొడి జుట్టు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల ఈ సీజన్‌లో జుట్టు సంరక్షణకు మరింత జాగ్రత్త అవసరం.
వేసవి ప్రభావం ఎలా ఉంటుందంటే?
అధిక ఉష్ణోగ్రతల వల్ల తల చర్మం పొడి పడుతుంది.
అతినీలలోహిత కిరణాలు జుట్టును బలహీనంగా మారుస్తాయి.
శరీరంలో పోషకాల లోపం (విటమిన్ D3, B12, ఇనుము) కూడా జుట్టు రాలే ప్రమాదాన్ని పెంచుతుంది.
తలలో చెమట, మురికి పేరుకుపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
Details
షాంపూ ఎంతవరకు వాడాలి?
వేసవిలో ప్రతిరోజూ తలకుదులడం కామన్ అయిపోతుంది. కానీ షాంపూను రోజూ వాడటం వల్ల:
జుట్టు తేమ కోల్పోయి పొడిగా మారుతుంది.
షాంపూలోని రసాయనాల వల్ల జుట్టు నాజూకు అవుతుంది.
అందువల్ల మైల్డ్ షాంపూ వాడటం ఉత్తమం. అలాగే ప్రతి శుభ్రత తర్వాత కండిషనర్ తప్పనిసరిగా వాడాలి.
కండిషనర్, హెయిర్ మాస్క్ తప్పనిసరి
వేసవిలో జుట్టు తేమ కోల్పోవడం సహజం.
కండిషనర్ వల్ల ఈ తేమను భర్తీ చేయవచ్చు.
ఈతకుపోయే వారు లీవ్-ఇన్ కండిషనర్ వాడి, స్విమ్మింగ్ కాప్ వేసుకోవాలి.
చిట్లిపోయిన వెంట్రుకలకు ట్రిమ్మింగ్ చేయడం మంచిది.
Details
హీట్ స్టైలింగ్ తగ్గించండి
వేసవిలో ఇప్పటికే ఎండ వల్ల జుట్టు దెబ్బతింటోంది.
అలాంటప్పుడు హీట్ స్టైలింగ్ జుట్టును మరింత నాశనం చేస్తుంది.
హైడ్రేషన్ చాలా అవసరం
తగినంత నీరు తాగకపోతే జుట్టు ఆరోగ్యం తగ్గిపోతుంది.
నీటితో పాటు ఇతర ద్రవాహారాలను తీసుకోవాలి.
Details
ఇంటి చిట్కాలు ఉపయోగించండి
మెంతి గింజల మిశ్రమం + పెరుగు = ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.
అరటిపండు + తేనె + నిమ్మరసం = మంచి హెయిర్ మాస్క్.
బార్లీ నీటితో తల కడగడం వల్ల చిట్లిన వెంట్రుకలకు ఉపశమనం.
జిడ్డు జుట్టు ఉంటే pH బ్యాలెన్స్ ఉన్న కండిషనర్ వాడాలి.
హెయిర్ కలర్ వాడే వారు సీరం వేసుకుని బయటకు వెళ్లాలి.