
వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలను సాగదీసే వ్యాయామాలు ఎందుకు చేయాలో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు బిగుతుగా మారతాయి. అలాంటప్పుడు ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు వస్తుంటాయి. అందుకే కండరాలను సాగదీసే వ్యాయామాలు చేయాలి.
రోజూ తెల్లారగానే శరీరాన్ని సాగదీసే వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఎలాంటి సాగదీత వ్యామాయాలు చేయాలో చూద్దాం.
మెడను పక్కకు వంచండి:
సౌకర్యంగా నిల్చుని మెడను పక్కకు వంచండి. ఈ టైమ్ లో మెడ కండరాలు సాగుతున్నట్లుగా అనిపిస్తుంటుంది. అప్పుడు మళ్లీ మరో వైపు మెడను వంచండి.
భుజాలను తిప్పండి:
సరిగ్గా నిల్చుని భుజాలను చెవి దగ్గర దాకా తీసుకొచ్చి గుండ్రంగా తిప్పండి. ఇలా కాసేపు చేసిన తర్వాత, మళ్ళీ భుజాలను రివర్స్ లో గుండ్రంగా తిప్పండి.
మధ్యలో కావాల్సి వస్తే బ్రేక్ తీసుకోండి.
వ్యాయామం
శరీరాన్ని సాగదీసే వ్యాయామాలు
భుజాన్ని సాగదీయండి:
మంచి పొజిషన్ లో నిల్చుని ఒక చేతిని మరో చేత్తో పట్టుకుని భూజాలను సాగదీయండి. ఇది చేసేటపుడు సాగదీసే చేతి మోచేయి, భుజం కంటే తక్కువ ఎత్తులో ఉండాలి. ఇలా వేరే భుజానికి కూడా చేయండి.
నడుమును వంచండి:
కాళ్ల మధ్య కొంత గ్యాప్ వదిలేసి దూరం పెట్టండి. ఇప్పుడు ఎడమ కాలిని అడుగు దూరంలో పెట్టి, మోకాలిని వంచండి. ఈ టైమ్ లో మీకు నడుము కండరాలు సాగుతున్నట్లుగా అనిపిస్తుంటుంది.
మోకాళ్ళను ఛాతి భాగానికి తాకించండి:
కుర్చీలో నిటారుగా కూర్చుని ఎడమ కాలిని భూమి మీద నుండి పైకి లేపి, మోకాలిని ఛాతి భాగం వరకు తీసుకురావాలి. ఈ ప్రయత్నంలో చేతులతో కాలిని పట్టుకుని ఛాతి వైపు లాగండి.