ఎగ్జామ్స్ టెన్షన్ ని దూరం చేసే టిప్స్, మీకోసమే
మార్చ్ వచ్చేసింది, ఎగ్జామ్ సీజన్ మొదలైంది. స్కూల్ పిల్లల దగ్గర నుండి కాలేజీ విద్యార్థుల దాకా ఎగ్జామ్ టెన్షన్ తో భయపడుతుంటారు. పరీక్షలంటే భయం సహజమే, అయినా కానీ అదెక్కువైతే ప్రమాదం. అందుకే ఎగ్జామ్ టెన్షన్ ని దూరం చేసే టిప్స్ తెలుసుకోండి. టైమ్ మేనేజ్ మెంట్: మీరిప్పటివరకూ ఏం చదివారు? ఎక్కడి వరకు మళ్ళీ చదవాలి? ఏవి ఇంపార్టెంట్? వేటికి ఎంత సమయం కేటాయించాలనేది మీరు డిసైడ్ అవ్వండి. ఆ తర్వాత చదవడం మొదలెట్టండి. ఎగ్జామ్స్ కదా అని పొద్దున్నుండి రాత్రి దాకా చదువుతూ కూర్చోకండి. మధ్య మధ్యలో కొన్ని గేమ్స్ ఆడండి. అప్పుడు మీకు కొత్త ఎనర్జీ వచ్చి చదవాలన్న కోరిక ఇంకా పెరుగుతుంది.
ఎగ్జామ్స్ భయాన్ని దూరం చేసే టిప్స్
భయాన్ని దూరం చేయాలంటే ఏదో ఒక పనిచేయాలి: ఎగ్జామ్స్ అంటే మీకున్న భయం పోవాలంటే, మంచి మ్యూజిక్ వినడమో, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, మీ ప్రియమైన వారితో సంభాషణలు, ఏదైనా హాబీలో పడిపోవడం వంటివి చేయండి. స్నేహితులతో చర్చలు వద్దు: ఎగ్జామ్స్ గురించీ, సిలబస్ గురించీ స్నేహితులతో డిస్కషన్ పెట్టుకోవద్దు. దానివల్ల ఎగ్జామ్ భయం ఇంకా పెరుగుతుంది. మీ భయాలను పెద్దవాళ్లతో చెప్పండి: మీకు భయం మరీ ఎక్కువైపోతే మీ తల్లిదండ్రులతో చెప్పండి. దానివల్ల మీరు ఫ్రీ అవుతారు. భయం తొలగిపోతుంది. అలాగే హ్యాపీగా నిద్రపోండి, కావాల్సినన్ని నీళ్ళు తాగండి. సరైన నిద్ర, కావాల్సినన్ని నీళ్ళు లేకపోతే మీరు యాక్టివ్ గా ఉండలేరు.