Page Loader
Brazil Nuts : థైరాయిడ్‌తో బాధపడుతున్నారా? రోగనిరోధక శక్తిని పెంచే నట్స్ ఇవే!
థైరాయిడ్‌తో బాధపడుతున్నారా? రోగనిరోధక శక్తిని పెంచే నట్స్ ఇవే!

Brazil Nuts : థైరాయిడ్‌తో బాధపడుతున్నారా? రోగనిరోధక శక్తిని పెంచే నట్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2025
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

నట్స్ అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు. అయితే, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇచ్చే వారు తమ డైట్‌లో బ్రెజిల్ నట్స్‌ను తప్పనిసరిగా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇతర నట్స్‌లానే బ్రెజిల్ నట్స్‌లోనూ అనేక పోషకాలుంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బ్రెజిల్ నట్స్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండిపోయి ఉంటాయి. వీటిలో అధికంగా సెలీనియం ఉంటుంది, ఇది మెటాబాలిజాన్ని మెరుగుపరిచి, కొవ్వును కరిగించడంలో సాయపడుతుంది. అంతేకాదు కండరాల అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.

Details

నొప్పుల నుంచి ఉపశమనం 

బ్రెజిల్ నట్స్ విటమిన్ ఈ అధికంగా కలిగి ఉండడం వల్ల చర్మాన్ని సంరక్షించడంలో సాయపడతాయి. ఇవి విటమిన్ B6, సెలీనియంతో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండటం వల్ల చర్మం కింద ఉండే కొవ్వును తొలగిస్తాయి. ఈ నట్స్‌లో అధికంగా ఉండే జింక్ శరీరం వాపులను నివారించడంలో సహాయపడుతుంది. ఫలితంగా నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా మార్చేస్తాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను, టాక్సిన్లను తొలగిస్తాయి. దీంతో శిరోజాలు ముడతలు లేకుండా మృదువుగా మారతాయి.

Details

పోషకాలతో నిండిన బ్రెజిల్ నట్స్ 

బ్రెజిల్ నట్స్ ప్రధానంగా అమెజాన్ అడవుల్లో లభిస్తాయి. బెర్తోలేటియా ఎక్సెల్సా అనే చెట్టు నుంచి ఈ గింజలు ఉత్పత్తి అవుతాయి. ఈ చెట్లు సుమారు 50 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. బ్రెజిల్‌తో పాటు బొలివియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనెజులా వంటి దేశాల్లోనూ విస్తరించి ఉన్నాయి. ఒక్కో బ్రెజిల్ నట్స్‌ చాలా పెద్దగా ఉంటాయి, దాదాపు ఖర్జూరం సైజులో ఉంటాయి. రోజుకు 3-5 బ్రెజిల్ నట్స్‌ను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Details

 ఒక్క బ్రెజిల్ నట్ తీసుకున్నా లభించే పోషకాలు 

33 క్యాలరీల శక్తి 1 గ్రాము కార్బోహైడ్రేట్లు 1 గ్రాము ప్రోటీన్లు 3 గ్రాముల కొవ్వులు 1 గ్రాము శాచురేటెడ్ ఫ్యాట్ 19 మిల్లీగ్రాముల మెగ్నీషియం 33 మిల్లీగ్రాముల పొటాషియం 96 మైక్రోగ్రాముల సెలీనియం 0.3 మిల్లీగ్రాముల విటమిన్ E

Details

థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారికి బ్రెజిల్ నట్స్ మేలు 

బ్రెజిల్ నట్స్ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే శరీర మెటాబాలిజం పెరిగి, కొవ్వును కరిగించడంలో సాయపడతాయి. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడటానికి ఈ నట్స్ దోహదం చేస్తాయి. మెటాబాలిజం సక్రమంగా ఉండటంతో థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి చాలా మేలు చేస్తాయి. లివర్ వ్యాధులతో బాధపడేవారు ఈ నట్స్‌ను తింటే త్వరగా కోలుకునే అవకాశముంది. బ్రెజిల్ నట్స్‌లో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం, శిరోజాల సమస్యలు తగ్గుతాయి. ఈనట్స్ నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. మెగ్నీషియం అధికంగా ఉండటంతో నిద్ర సమస్యలు తగ్గుతాయి. రాత్రివేళ కాళ్లు పిక్కటించకుండా ఉండటానికి సహాయపడతాయి.

Details

రోజూ బ్రెజిల్ నట్స్ తినాలి!

బ్రెజిల్ నట్స్‌ను ప్రతి రోజు డైట్‌లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మెటాబాలిజం పెరగడం, థైరాయిడ్ సమస్యల నివారణ, గుండె ఆరోగ్యం, చర్మం మెరుగవడం, శిరోజాల పోషణ, నాడీ వ్యవస్థ ఆరోగ్యం ఇలా అనేక రకాలుగా మేలు చేస్తాయి. కాబట్టి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు బ్రెజిల్ నట్స్‌ను కచ్చితంగా తినాలి!