LOADING...
Sugar-Free Lassi Recipe: మండే వేసవిలో ఉపశమనం పొందండిలా.. చక్కెర లేకుండానే క్షణాల్లో రుచికరమైన లస్సీ
మండే వేసవిలో ఉపశమనం పొందండిలా.. చక్కెర లేకుండానే క్షణాల్లో రుచికరమైన లస్సీ

Sugar-Free Lassi Recipe: మండే వేసవిలో ఉపశమనం పొందండిలా.. చక్కెర లేకుండానే క్షణాల్లో రుచికరమైన లస్సీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 25, 2026
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి కాలంలో ఎండ తీవ్రంగా ఉండే సమయంలో చల్లటి లస్సీ తాగితే శరీరానికి తక్షణమే ఉపశమనం కలుగుతుంది. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా అలసటను తగ్గించి ఉత్సాహాన్ని పెంచుతుంది. అయితే లస్సీలో ఎక్కువగా చక్కెర కలుపుతారని భావించి చాలామంది దాన్ని తాగేందుకు ఇష్టపడరు. బరువు పెరుగుతుందనే భయం, ఆరోగ్య సమస్యలపై ఆందోళన కారణంగా లస్సీకి దూరంగా ఉంటారు. అలాంటి వారికోసం చక్కెర ఉపయోగించకుండా సహజ తీపితో లస్సీ తయారు చేసే సులభమైన విధానం ఇది. ఇందులో పంచదార స్థానంలో బెల్లం పొడి లేదా ఖర్జూరాలు ఉపయోగిస్తారు. దీంతో రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. బెల్లం శరీరానికి శక్తిని అందిస్తే, ఖర్జూరాలు అవసరమైన పోషకాలను అందిస్తాయి.

వివరాలు

తయారికి కావాల్సిన పదార్థాలు ఇవే

చిక్కటి తాజా పెరుగు - 2 కప్పులు నానబెట్టిన ఖర్జూరాలు - 4 నుంచి 5 లేదా బెల్లం పొడి - 3 టీస్పూన్లు యాలకుల పొడి - అర టీస్పూన్ చల్లటి పాలు - పావు కప్పు కుంకుమపువ్వు దారాలు - కొద్దిగా ఐస్ క్యూబ్స్ - అవసరమైనంత మీగడ - అవసరమైనంత

వివరాలు

తయారీ విధానం ఇదే..

ముందుగా ఖర్జూరాలను కొద్దిగా గోరువెచ్చని పాలలో వేసి సుమారు 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిని మెత్తగా రుబ్బి గుజ్జులా చేసుకోవాలి. బెల్లం పొడి వాడాలనుకుంటే నేరుగా కలిపేయవచ్చు. తర్వాత మిక్సీ జార్ లేదా బ్లెండర్‌లో పెరుగు, ఖర్జూర గుజ్జు లేదా బెల్లం పొడి, యాలకుల పొడి వేసి బాగా బ్లెండ్ చేయాలి. పెరుగు నునుపుగా మారి పైభాగంలో నురుగు వచ్చే వరకు కలపాలి. అనంతరం ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి స్వల్పంగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు గ్లాసులో పోసి పై నుంచి కుంకుమపువ్వు దారాలు, కొద్దిగా మీగడ వేసి చల్లగా వడ్డించాలి.

Advertisement

వివరాలు

ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

ఈ చక్కెరలేని లస్సీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సహజ తీపి కారణంగా రుచిలో ఎలాంటి తగ్గుదల లేకుండా ఆరోగ్యకరమైన పానీయాన్ని ఆస్వాదించవచ్చు. వేసవి రోజుల్లో ప్రతిరోజూ ఒక గ్లాస్ తాగితే శరీరం తాజాగా, ఉల్లాసంగా ఉంటుంది.

Advertisement