Panakam Sharbat : సమ్మర్ స్పెషల్.. చల్లచల్లని పానకం షర్బత్ తయారీ ఇలా!
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి కాలంలో ఎంత నీళ్లు తాగినా దాహం తీరని పరిస్థితి ఉంటుంది. ఈ సీజన్‌లో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అందుకే చాలామంది మజ్జిగ, నిమ్మరసం షర్బత్‌లను తాగుతుంటారు. అలాంటి వారికి మరో టేస్టీ, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పానకం షర్బత్ మంచి ఎంపిక. ఈ రెసిపీని ఇంట్లో తయారు చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తాగుతారు.
వివరాలు
కావాల్సిన పదార్థాలు
నిమ్మకాయలు - 4
దొడ్డు ఉప్పు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
యాలకులు - 10
బెల్లం తురుము - 350 గ్రాములు
మిరియాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
సోంపు - 1 టేబుల్ స్పూన్
అల్లం - కొద్దిగా
తులసి ఆకులు - కొన్ని
సబ్జా గింజలు - రెండున్నర టేబుల్ స్పూన్లు
శొంఠి - కొద్దిగా
వివరాలు
తయారీ విధానం
ముందుగా చిన్న కప్పులో రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు తీసుకుని వాటిలో సరిపడా నీరు పోసి నానబెట్టాలి.
తరువాత మిక్సీ జార్‌లో శొంఠి, మిరియాలు, కొద్దిగా ఉప్పు, సోంపు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి.
అదే మిశ్రమంలో యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
అనంతరం ఒక పెద్ద గిన్నెలో బెల్లం తురుము, గ్రైండ్ చేసిన మిశ్రమం, నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి.
ఇందులో నాలుగు లీటర్ల నీరు, తులసి ఆకులు, అల్లం ముక్కలు వేసి బాగా కలపాలి.
తర్వాత నిమ్మరసం పిండి, నిమ్మచెక్కలను కూడా అందులోనే ఉంచాలి.ఇవి పానకానికి మంచి ఫ్లేవర్ ఇస్తాయి.
బెల్లం పూర్తిగా కరిగే వరకు మిశ్రమాన్ని బాగా కలిపి,సుమారు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి.