Womens Day Special Tour: సన్, సాండ్, ఫన్.. మీ గర్ల్ గ్యాంగ్‌తో ఈ ప్రదేశాలను చూడడం మిస్ అవొద్దు!
ఈ వార్తాకథనం ఏంటి
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మీ గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎంజాయ్ చేయడానికి అద్భుతమైన ట్రిప్ లొకేషన్లు!
ఈ ప్రత్యేకమైన రోజును మరింత స్మరణీయంగా మార్చుకోవడానికి కొన్ని బ్యూటీఫుల్ ప్లేసెస్ మీ కోసం. ట్రావెలింగ్ అంటే అందరికీ ఇష్టమే.
కానీ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు తక్కువగా ట్రిప్స్ ప్లాన్ చేస్తారు. కానీ ఈ సారి భిన్నంగా ఆలోచించండి. మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి మీ గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఓ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, మీకు సరిపోతున్న ట్రావెల్ డెస్టినేషన్స్ ఇవే!
Details
1) గోవా
గోవా అనగానే మగవాళ్లకే అనుకూలమైన డెస్టినేషన్ అని అనుకోవద్దు. ఇక్కడ బీచ్‌లపై మీ గర్ల్ గ్యాంగ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ, సందడిగా ఎంజాయ్ చేయడం మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది.
మార్చిలో గోవా వాతావరణం రాత్రిపూట చల్లగా ఉంటుంది, వీకెండ్ గెటవేలకు ఇది బెస్ట్. బైకులను అద్దెకు తీసుకుని గ్రామాలు, చర్చిలు, బీచ్‌లు చుట్టేయండి.
అదనంగా, అద్భుతమైన ఫొటోలకు కూడా ఇది సరిగ్గా సరిపోతుంది.
2)రిషికేశ్
మీ గ్యాంగ్‌లో అందరూ ఆధ్యాత్మికతను, ప్రశాంతతను ఇష్టపడతారా? అయితే ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ బాగా నచ్చుతుంది.
గంగానది ఒడ్డున ఉన్న ఈ పట్టణం యోగా, ధ్యానం, ప్రశాంత వాతావరణం కోసం ప్రసిద్ధి.
బంగీ జంపింగ్, రివర్ రాఫ్టింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీల కోసం కూడా ఇది బెస్ట్ డెస్టినేషన్.
Details
3) మనాలి
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి మీ గర్ల్ గ్యాంగ్‌తో కలిసి మధురమైన ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవడానికి సరైన ప్రదేశం.
మార్చి నెలలో తాజా మంచును ఆస్వాదిస్తూ, ఎత్తైన పర్వతాలు, మంచు కొండలు, సరస్సులతో కూడిన ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్, రోప్ వే, ఏటీవీ రైడింగ్ వంటి సాహస క్రీడలను ఆస్వాదించవచ్చు.
4) హంపి
హంపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన ప్రదేశం. పురాతన శిథిలాలు, దేవాలయాలు, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్మారకాలు కలిగిన ఈ నగరాన్ని మీ గర్ల్ గ్యాంగ్‌తో కలిసి అన్వేషించవచ్చు.
గుండ్రటి పడవల్లో ప్రయాణించడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఒంటరిగా వెళ్లాలనుకున్నా సురక్షితమైన ప్రదేశం.
Details
5) పుదుచ్చేరి
అద్భుతమైన విల్లాలు, ఫ్రెంచ్ శైలి రోడ్లు, కలర్‌ఫుల్ తలుపులతో కూడిన ప్రదేశం పుదుచ్చేరి.
బీచ్‌లు, నైట్ లైఫ్, షాపింగ్, రాత్రి సముద్రపు అలలను ఆస్వాదించడం వంటి అనేక అందమైన అనుభూతులను ఇక్కడ అనుభవించవచ్చు.
మహిళా దినోత్సవాన్ని మీ గర్ల్ గ్యాంగ్‌తో మస్త్‌గా సెలబ్రేట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ లొకేషన్.
6) మున్నార్
కేరళలోని మున్నార్ ప్రకృతి ప్రేమికులకు పర్‌ఫెక్ట్ డెస్టినేషన్. పచ్చటి తేయాకుల తోటలు, పొగమంచుతో కప్పిన కొండలు, ప్రశాంతమైన వాతావరణంతో మునిగిపోయేలా చేసే అందమైన ప్రదేశం.
హిల్ స్టేషన్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఆయుర్వేద మసాజ్, సుగంధ ద్రవ్యాల తోటల సందర్శన కోసం కూడా మున్నార్ ప్రసిద్ధి. ఈ