రుతుక్రమ సమస్యలపై పోరాటం: సూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్న సుప్రీంకోర్టు
స్కూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్న సుప్రీంకోర్టు రుతుక్రమం గురించి పబ్లిక్ గా మాట్లాడటం సరైన పని కాదని భారతీయ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే రుతుక్రమంలో శుభ్రత పాటించడం వంటి విషయాలను పెద్దగా పట్టించుకోవట్లేదు. తాజాగా భారత అత్యున్నత న్యాయస్థానం, నెలసరి కారణంగా ప్రభావితమయ్యే ఆరోగ్యంపై చర్చను లేవనెత్తింది. 6-12తరగతి చదువుతున్న ఆడపిల్లలకు పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్ అందించాలని, అలాగే ప్రత్యేక మూత్రశాలలు ఖచ్చితంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను జాతీయ విధానంగా మార్చాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఛీఫ్ జస్టిస్ జేవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ప్రధాన బెంచ్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఆడపిల్లలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని తెలిపింది.
రుతుక్రమంలో శుభ్రత పాటించకపోతే వచ్చే ఇబ్బందులు
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలు, మూత్రశాలల నిష్పత్తి ఏ విధంగా ఉందో తెలియజేయమని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది సుప్రీం కోర్ట్. రుతుక్రమంపై పిల్లల్లో అవగాహన కల్పించాలని తెలిపింది. రుతుక్రమంలో పరిశుభ్రత మీద కేంద్ర ప్రభుత్వం 197కోట్లు మంజూరు చేసిందని ఐశ్వర్య బాటి తెలిపారు. రుతుక్రమంలో అపరిశుభ్రత వల్ల కలిగే అనర్థాలు: రుతుక్రమంలో శుభ్రత పాటించకపోతే మూత్ర సంబంధ వ్యాధులు, సంతానంలో సమస్యలు ఏర్పడతాయి. అపరిశుభ్రత కారణంగా పుట్టబోయే బిడ్డల్లో ఇబ్బందులు, సంతానం కలగకపోవడం వంతి సమస్యలు తలెత్తుతాయి. అపరిశుభ్రత కారణంగా ఒక్కోసారి ఆడపిల్లలు పాఠశాలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు స్కూల్స్ లో రుతుక్రమం పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.