
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: మీ బాడీ టైప్ తెలుసుకోకుండానే జిమ్ కి వెళితే కలిగి నష్టాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతీ ఏడాది ఏప్రిల్ ఏడవ తేదీన ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతోంది.
ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు చాలామంది వ్యాయామం చేయడం గురించి, జిమ్ కి వెళ్లడం గురించి మాట్లాడుతుంటారు.
చాలాసార్లు తమ బాడీ గురించి తమకేమీ తెలియకుండానే జిమ్ కి వెళ్లి రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది. అదేంటో చూద్దాం.
స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం
కొత్తగా జిమ్ కి వెళ్ళిన వాళ్ళు కండలు బాగా పెరగాలని స్టెరాయిడ్స్ తీసుకుంటారు. వీటి డోస్ ఎక్కువ కావడం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఆడవాళ్లకు అవాంచిత రోమాలు రావడం, మగవాళ్లకు రొమ్ము భాగం పెరగడం జరుగుతుంటుంది.
వ్యాయామం
కొత్తగా వ్యాయామం మొదలెట్టినపుడు చేయకూడని పొరపాట్లు
వ్యాయామం తప్పుగా చేయడం
కొత్తగా జిమ్ కి వెళ్ళినప్పుడు ఉత్సాహంలో రకరకాల వ్యాయామాలు చేసేస్తుంటారు. ఈ వ్యాయామాలను తప్పుగా చేయడం వల్ల శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. కొన్ని కొన్ని సార్లు తీవ్రంగా గాయాలు అవుతుంటాయి.
ఎక్కువ సమయం ఎక్సర్ సైజ్ చేయడం
అతిగా వ్యాయామం మంచిది కాదు. దానివల్ల అనేక అనర్థాలు కలుగుతాయి. ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల యాంగ్జాయిటీ, డిప్రెషన్ కలుగుతుంది.
అనవసర సలహాలు వినడం
వ్యాయామంలో నిపుణులు కాని వారి సలహాలు తీసుకోవడం ఒక్కోసారి శరీరానికి చేటు చేస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి
వ్యాయామం అంటే బరువు తగ్గడం అనుకోవడం :
చాలామంది ఇలాగే అనుకుంటారు ఇది నిజం కాదు.