Sweet Potato Gulab Jamun : ఇన్‌స్టంట్ స్వీట్ కోసం బెస్ట్ ఆప్షన్.. చిలగడదుంప గులాబ్ జామూన్ రెసిపీ
ఈ వార్తాకథనం ఏంటి
జ్యూసీ, నోట్లో కరిగిపోతూ చటుక్కున తినిపించే గులాబ్ జామూన్స్ పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఇష్టపడతారు. ప్రతి వ్యక్తికి వేర్వేరు స్టైల్‌లో ఈ స్వీట్ తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు ఓకేలా కాకుండా ఈసారి చిలగడదుంపలతో ఓసారి గులాబ్ జామూన్ ట్రై చేశారంటే సూపర్‌గా వస్తాయి. చాలా తక్కువ పదార్థాలతో, తక్షణమే ఇంట్లో సిద్ధం చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్‌గా ఏదైనా మిఠాయి కావాలంటే, ఈ రెసిపీ బెటర్ ఆప్షన్. బిగినర్స్ కూడా సులభంగా ఈ పద్ధతిలో తయారు చేయవచ్చు. చిలగడదుంప తినని వారు కూడా ఈ స్వీట్‌ను భలే ఇష్టపడతారు.
వివరాలు
కావాల్సిన పదార్థాలు:
చిలగడదుంపలు - 500 గ్రాములు (అర కేజీ) బెల్లం తురుము - 1 కప్పు యాలకుల పొడి - 2 టీ స్పూన్లు గోధుమ పిండి - 3 స్పూన్లు మిల్క్ పౌడర్ - 1 స్పూన్ ఉప్పు - చిటికెడు బేకింగ్ సోడా - చిటికెడు డీప్ ఫ్రైకి ఆయిల్ - సరిపడా
వివరాలు
తయారీ విధానం:
చిలగడదుంపలను శుభ్రంగా కడిగి, ముక్కలుగా కట్ చేసి కుక్కర్‌లో వేసి, సరిపడా నీళ్లు పోసి, మీడియం ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చిలగడదుంపలు ఉడికిన తర్వాత వాటిని తీసి చల్లారనివ్వాలి. తరువాత పొట్టుతీసి గ్రేటర్‌తో తురుముకోవాలి. మిక్సింగ్ బౌల్లో తురుముకున్న చిలగడదుంప, 3 స్పూన్ల గోధుమ పిండి, 1 స్పూన్ మిల్క్ పౌడర్, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టాలి.
వివరాలు
తయారీ విధానం:
పాన్‌లో బెల్లం, సరిపడా నీళ్లు వేసి మధురంగా కరిగించాలి. కరిగిన తర్వాత, మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాలు మరిగించాలి. తరువాత 2 టీ స్పూన్ల యాలకుల పొడి కలిపి, స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి. డీప్ ఫ్రైకి కడాయిలో సరిపడా ఆయిల్ వేడెక్కిన తర్వాత, రెడీ చేసిన ఉండలను కడాయిలో వేసి మొదట 1 నిమిషం వదిలేయాలి. తరువాత, రెండు వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేయించిన ఉండలను వేడిగా కరిగించిన బెల్లం పాకంలో వేసి, 1-2 గంటల పాటు వదిలేయాలి. తర్వాత సర్వ్ చేయండి.