Loading...
Swiss Heart Surgeon: గుండె డాక్టర్ అరుదైన ఘనత.. 3,200 హృదయాకారపు వస్తువులతో స్విస్ డాక్టర్‌కు గిన్నిస్ రికార్డు
గుండె డాక్టర్ అరుదైన ఘనత..

Swiss Heart Surgeon: గుండె డాక్టర్ అరుదైన ఘనత.. 3,200 హృదయాకారపు వస్తువులతో స్విస్ డాక్టర్‌కు గిన్నిస్ రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణురాలు డయానా రెసెర్ అరుదైన ఘనత సాధించారు. హృదయాకారంలో ఉండే వస్తువులను అత్యధికంగా సేకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. ఏకంగా 3,200 గుండె ఆకారపు వస్తువులను సేకరించి ఈ రికార్డును నెలకొల్పారు. జ్యూరిచ్ సమీపంలోని జొల్లికాన్‌లో నివసించే డయానా.. ఈ ఏడాది ఏప్రిల్ 13న తన సేకరణను అధికారికంగా లెక్కించి రికార్డును సొంతం చేసుకున్నారు.

వివరాలు 

రెండోసారి గిన్నిస్ రికార్డు

డయానా రెసెర్‌కు ఈ రికార్డు దక్కడం ఇది రెండోసారి కావడం విశేషం.

2010లో తొలిసారిగా 775 హృదయాకారపు వస్తువులతో ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.

అయితే 2024లో అమెరికాకు చెందిన సుసాన్ వెస్ట్ 1,560 వస్తువులను సేకరించి డయానా రికార్డును అధిగమించారు.

తాజాగా 3,200 వస్తువులతో సరికొత్త రికార్డు సృష్టించిన డయానా.. మళ్లీ తన పాత టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

అంతేకాకుండా, తన ప్రత్యేక విభాగంలో ప్రొఫెసర్ హోదాలో ఈ గుర్తింపు పొందిన తొలి స్విస్ మహిళగా కూడా ఆమె నిలిచారు.

వివరాలు 

25 ఏళ్లుగా కొనసాగుతున్న అభిరుచి

సుమారు 25 ఏళ్ల క్రితం వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలో డయానాకు ఈ సేకరణపై ఆసక్తి మొదలైంది.

గుండె శస్త్రచికిత్సను తన వృత్తిగా ఎంచుకున్న తర్వాత స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు హృదయాకారంలో ఉండే వస్తువులను బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు.

దీంతో ఈ తరహా వస్తువులపై ఆసక్తి మరింత పెరిగింది. ఆ తర్వాత ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ వాటిని సేకరించడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం ఆమె దగ్గర ఉన్న వస్తువుల్లో సగం ఇతరులు బహుమతిగా ఇచ్చినవి కాగా.. మిగిలిన సగం ఆమె స్వయంగా కొనుగోలు చేసినవే.

ADVERTISEMENT

వివరాలు 

సేకరణలో ప్రత్యేకమైన వస్తువులు

డయానా సేకరణలో సాధారణంగా ఉపయోగించే సబ్బులు,నగల పెట్టెలు,దుస్తులు,కార్లలో వినియోగించే ఎయిర్ ఫ్రెషనర్లు ఉన్నాయి.

వీటితో పాటు కొన్ని అరుదైన వస్తువులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

గుండె ఆకారంలో ఉండే రూబిక్స్ క్యూబ్,పనిచేసే స్టెతస్కోప్, బెర్లిన్ గోడకు చెందిన ఓ ముక్క ఇందులో ఉన్నాయి.

అంతేకాకుండా, ఆమె సోదరి గీసిన గుండె ఆకారపు ముఖం కలిగిన గుడ్లగూబ పెయింటింగ్ కూడా ఈ సేకరణలో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు 

సేకరణలో ప్రత్యేకమైన వస్తువులు

వీటితో పాటు డయానా తన శరీరంపై ఆరు గుండె ఆకారపు టాటూలను కూడా వేయించుకున్నారు.

గుండె శస్త్రచికిత్సపై తనకున్న ఆసక్తితో పాటు.. మన రోజువారీ జీవితంలోనూ గుండె ఆకారం ఎంతగా భాగమైందో ఈ సేకరణ ద్వారా తెలుసుకోవచ్చని డయానా తెలిపారు.

ఈ రెండు అంశాలే తనను హృదయాకారపు వస్తువులను సేకరించేలా ప్రేరేపించాయని ఆమె వెల్లడించారు.

ADVERTISEMENT