
కిడ్నీ సమస్యలు ఉన్నవారు పర్యాటక ప్రదేశాలు సందర్శించాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసులో కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే పర్యాటక ప్రదేశాలకు వెళ్లడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.
అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు పర్యాటక ప్రదేశాలు చూడాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రముఖ యూరాలజిస్ట్ ప్రకాష్ చంద్ర శెట్టి తెలియజేస్తున్న జాగ్రత్తలు ఇవే.
కావాల్సినన్ని నీళ్లు తాగండి సాధారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కావాల్సినన్ని నీళ్లు తాగడం మర్చిపోతుంటారు. మీరు మాత్రం అస్సలు మరువకండి.
మందులు తీసుకెళ్లండి
కిడ్నీలకు సంబంధించి మీరు ఏవైనా మందులు వాడుతున్నట్లయితే వాటిని తప్పకుండా తీసుకెళ్లండి. అలాగే మీకు డయాలసిస్ పేషెంట్ అయితే కనుక మీరు పర్యటిస్తున్న ప్రాంతానికి దగ్గరలో డయాలసిస్ సెంటర్ ఉందేమో కనుక్కోండి.
Details
ఇన్స్యూరెన్స్ డాక్యుమెంట్లు తప్పనిసరి
ఆహార అలవాట్లలో జాగ్రత్తలు
ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన మాంసాహారాలు తీసుకోకుండా ఉండడమే మంచిది. వాటిల్లో ఫాస్ఫరస్, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా సరే తాజాగా వండిన వాటిని తినండి. సోడియం తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోండి.
ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోండి
కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ చేతిలో ఎప్పుడూ శానిటైజర్ ఉంచుకోండి.
ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లండి
మీరు ఎక్కువ రోజులు పర్యటించాలనుకుంటే ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లండి. అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా ఎదురు కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.