ట్రావెల్: వర్షాకాలంలో అందమైన అనుభూతిని పంచే భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఒక పక్క వర్షపు చినుకులు నెమ్మదిగా కురుస్తూ ఉంటే, మరోపక్క చేతిలో కాఫీ కప్పు పట్టుకుని పడవలో కూర్చుని, నదిలో పడుతున్న వర్షపు చినుకులను చూస్తే ఎంత బాగుంటుందో కదా!
ఈ అనుభవాన్ని అనుభవించాలంటే వర్షాకాలంలో భారతదేశంలో పర్యటించాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకోవాల్సిందే.
కూర్గ్ - కర్ణాటక:
ఇండియాలో అత్యధిక వర్షాపాతం ఉన్న ప్రాంతాల్లో కూర్గ్ ఒకటి. ఈ ప్రాంతంలో పొంగిపొర్లే నదులు, దూకే జలపాతాలు అద్భుతమైన ఫీలింగ్ అందిస్తాయి.
హనీమూన్ కపుల్స్ కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. చుట్టూ కొండలు, పరవశింప జేసే పచ్చదనాన్ని చూస్తూ కాఫీ తాగితే ఆ మజాయే వేరు.
Details
ప్రకృతిని చూస్తూ పరవశించేందుకు హౌస్ బోట్
లోనావాలా - మహారాష్ట్ర:
ఆకుపచ్చని మైదానాలు, పాల పొంగులాంటి జలపాతాలు లోనావాలా ప్రాంతాన్ని వర్షాకాలంలో పర్యటించే అద్భుతమైన ప్రదేశంగా మార్చేస్తాయి.
వర్షపు చినుకుల వంక చూస్తూ, మసాలా ఛాయ్, వడాపావ్ తినడాన్ని ఎంజాయ్ చేయడం మర్చిపోవద్దు.
గోవా:
వర్షాకాలంలో గోవా ఏంటీ అనుకుంటున్నారా? మీకు ట్రెక్కింగ్, చేపలను పట్టడం, పక్షులను చూడటం ఇష్టమైతే వర్షాకాలంలో గోవా వెళ్లాల్సిందే.
వర్షాకాలంలో గోవా బీచుల్లో జనాలు తక్కువగా ఉంటారు. వాటర్ గేమ్స్ అందుబాటులో ఉండవు.
అలెప్పీ - కేరళ:
ఆయుర్వేద రిసార్టులు, బ్యాక్ వాటర్ ప్రదేశాలకు ఫేమస్ అయిన అలెప్పీ(అలపూజ) ప్రాంతం, పర్యాటకులకు స్వర్గధామంలా ఉంటుంది.
హౌస్ బోట్ లో కూర్చును హ్యాపీగా ప్రకృతిని చూస్తూ పరవశంలో మునిగిపోవచ్చు.