Teddy Day Wishes: టెడ్డీ డే రోజున మీ ప్రియమైన వారికి మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు అందమైన సందేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని ప్రేమికులు ప్రతి ఏడాది వాలెంటైన్స్ వీక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.
ప్రేమకు అంకితమైన ఫిబ్రవరి నెలలో, 7వ తేదీ నుంచి వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది.
ఈ సందర్భంగా, ఫిబ్రవరి 10న టెడ్డీ డేని జరుపుకుంటారు. ఈ రోజు, ప్రేమికులు ఒకరికి ఒకరు టెడ్డీలను బహుమతిగా ఇచ్చుకుంటారు.
ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత గుర్తుండిపోయేలా చేయడానికి, మీరు టెడ్డీ బహుమతితో పాటు అందమైన శుభాకాంక్షలు కూడా పంపండి.
ఈ సందేశాల ద్వారా, మీ హృదయపు భావాలను వ్యక్తపరచవచ్చు.
వివరాలు
టెడ్డీ డే 2025 ప్రత్యేక శుభాకాంక్షలు
1. నువ్వు టెడ్డీ బేరిలా ముద్దుగా ఉంటావు.నీవు టెడ్డీబేర్ లా నవ్వుతూనే ఉంటావు, నీ హృదయంలో నేను ప్రియమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నా...హ్యాపీ టెడ్డీ డే!
2. ఈ టెడ్డీ డే రోజున నేను ఎప్పుడూ నీతోనే ఉంటానని,నిన్ను ఎప్పుడూ బాధ పెట్టనని, నీ జీవితంలో ఎప్పుడూ సమస్యలు రాకుండా చూసుకుంటానని నిజమైన ప్రేమతో నీకు వాగ్దానం చేస్తున్నాను. హ్యాపీ టెడ్డీ డే!
3. నా ప్రేమతో నీకు టెడ్డీని పంపుతున్నాను నీకు నేను నచ్చితే,నీవు ప్రేమతో మరొక టెడ్డీని నాకు పంపు. హ్యాపీ టెడ్డీ డే!
వివరాలు
టెడ్డీ డే 2025 ప్రత్యేక శుభాకాంక్షలు
4. నీ జ్ఞాపకాలు ఎప్పుడూ నా హృదయంలోనే ఉంటాయి.నీవు దూరంగా ఉన్నా మన ప్రేమ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎంత దూరమైనా,నా నుంచి ఒక చిన్న టెడ్డీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నీకు వస్తూనే ఉంటుంది. హ్యాపీ టెడ్డీ డే!
5. కొన్ని భావాలు మన హృదయాన్ని తాకుతాయి కొన్ని జ్ఞాపకాలు మన గుండెల్లో నిలిచిపోతాయి, పువ్వులు నిర్జీవమైన తోటలో కూడా వికసిస్తాయి, నా జీవితంలో నువ్వు అందమైన టెడ్డీబేర్ లాంటివి! హ్యాపీ టెడ్డీ డే!
6. నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి కానీ నిన్ను చూస్తే వాటన్నింటినీ మర్చిపోతాను, నువ్వే నా టెడ్డీబేర్, హ్యాపీ టెడ్డీ డే!
వివరాలు
టెడ్డీ డే 2025 ప్రత్యేక శుభాకాంక్షలు
7. ఈ రోజును మరింత ప్రత్యేకంగా మార్చేందుకు నేను నీకు కౌగిలించుకునేందుకు ఒక టెడ్డీ బేర్ పంపిస్తున్నాను, హ్యాపీ టెడ్డీ డే!
8. ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి టెడ్డీబేర్ ఇచ్చే వెచ్చదనం, కౌగిలింత, ఓదార్పు ఎంతో విలువైనవి, నా ప్రేమను అంగీకరించేందుకు ఈ చిన్న టెడ్డీ బేర్ స్వీకరించు. హ్యాపీ టెడ్డీ డే!
9. టెడ్డీ బేర్ ప్రేమ, మృదుత్వం, శాశ్వతత్వాన్ని సూచిస్తుంది నా ప్రేమకు గుర్తుగా ఈ టెడ్డీని అర్పిస్తున్నాను. హ్యాపీ టెడ్డీ డే!
10. నీ రోజును ప్రకాశవంతం చేయడానికి నీ హృదయాన్ని ప్రేమతో నింపడానికి ఈ టెడ్డీ బేర్ తో నీకు హగ్ పంపుతున్నాను. హ్యాపీ టెడ్డీ డే!
వివరాలు
టెడ్డీ డే 2025 ప్రత్యేక శుభాకాంక్షలు
11. నేను పంపే ప్రతి హగ్, ప్రతి ముద్దు నా హృదయం నిండా ఉన్న ప్రేమను చూపుతుంది, హ్యాపీ టెడ్డీ డే!
12. నా గుండె వేగంగా కొట్టుకునేలా చేసే వ్యక్తికి ఈ అందమైన టెడ్డీ బేర్ ని పంపిస్తున్నాను, హ్యాపీ టెడ్డీ డే!
13. నువ్వే నా టెడ్డీబేర్ నా ప్రాణ స్నేహితుడు, నా చిరకాల ప్రేమ, హ్యాపీ టెడ్డీ డే!
14. టెడ్డీ బేర్ కౌగిలింత ప్రేమ భాష మాట్లాడుతుంది ఈ టెడ్డీ దినోత్సవం సందర్భంగా నా ప్రేమను నీకు అంకితం చేస్తున్నాను! హ్యాపీ టెడ్డీ డే!
15. నీతో గడిపే ప్రతి క్షణం, ప్రతి హగ్, ప్రతి ముద్దు, అందమైన జ్ఞాపకాలుగా మారిపోతాయి... హ్యాపీ టెడ్డీ డే!