Christmas : క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు బెస్ట్ ఛాయిస్.. ఇండియాలోని టాప్ డెస్టినేషన్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
డిసెంబర్ నెల వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రధాన పండుగల్లో క్రిస్మస్ తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది. అత్యధిక సంఖ్యలో ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకునే ఈ పండుగ కోసం ఇప్పటికే మార్కెట్లు రంగురంగుల క్రిస్మస్ అలంకరణ సామగ్రితో కళకళలాడుతున్నాయి. చాలా మంది ఫెస్టివల్ షాపింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక భారత్‌లో ఉండి విదేశీ కంపెనీలకు పని చేసే ఉద్యోగులకు క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ రోజుల సెలవులు లభిస్తాయి. దీంతో పండుగకు ముందు, పండుగ రోజు, తర్వాత కూడా ట్రావెల్ చేయాలని చాలామంది ఆసక్తి చూపుతుంటారు. అలాంటి ప్రయాణ ప్రియుల కోసం క్రిస్మస్ వేడుకలను ఆస్వాదించడానికి ఇండియాలోని బెస్ట్ డెస్టినేషన్స్ ఇవీ...
Details
గోవా
సాధారణ రోజుల్లోనే కాకుండా క్రిస్మస్ స్పెషల్ డెస్టినేషన్‌గా గోవాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రిస్మస్‌కు నెల రోజుల ముందే ఇక్కడ సందడి మొదలవుతుంది. చర్చిలన్నీ రంగురంగుల లైట్లు, అలంకరణలతో మెరిసిపోతాయి. హోటళ్లు, వ్యాపార సముదాయాలు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో జరిగే సంగీత కచేరీలు ఆకట్టుకుంటాయి. బీచ్‌లలో జరిగే క్రిస్మస్ పార్టీలకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. మొత్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు గోవా ఒక అద్భుతమైన వేదిక.
Details
సిమ్లా
ప్రపంచ ప్రసిద్ధ హిల్ స్టేషన్‌లలో ఒకటైన సిమ్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. వేడుకలతో పాటు ఇక్కడి పర్వత లోయలు, పచ్చని ప్రకృతి టూరిస్టులను మంత్రముగ్ధులను చేస్తాయి. అందుకే చాలా మంది తమ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ప్లాన్ చేస్తుంటారు. ఇక ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ టూరిస్టులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. డామన్ అండ్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ అండ్ డయ్యూ కూడా క్రిస్మస్ సందర్భంగా టూరిస్టులను ఆకర్షించే ప్రముఖ డెస్టినేషన్. అందమైన బీచ్‌లు, ప్రత్యేకంగా అలంకరించిన చర్చీలు, ట్రెడిషనల్ మరియు పోర్చుగీస్ వంటకాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
Details
కోల్‌కతా
క్రిస్మస్ స్పెషల్ డెస్టినేషన్‌లలో కోల్కతాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఆంగ్లో-ఇండియన్ జనాభా ఎక్కువగా ఉండటంతో క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. డిసెంబర్ నెలంతా చర్చీలు అద్భుతమైన అలంకరణలతో మెరిసిపోతాయి. వింటర్ స్పెషల్ స్వీట్స్ క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. క్రిస్మస్ ట్రీలు, లైట్లు, స్టార్‌లతో కోల్కతా వీధులన్నీ టూరిస్టులకు స్వాగతం పలుకుతాయి.
Details
ఢిల్లీ
క్రిస్మస్ సమయంలో టూరిస్టులు ఇష్టపడే మరో డెస్టినేషన్ ఢిల్లీ. ఇక్కడి చర్చీలను ఎంతో అందంగా డెకరేట్ చేస్తారు. డిసెంబర్ మొదటి వారం నుంచి క్రిస్మస్ ముగిసే వరకు సంగీత కచేరీలు, క్రిస్మస్ పార్టీలు సందడిగా జరుగుతాయి. ముఖ్యంగా క్రిస్మస్ ఈవ్ పార్టీలు, షాపింగ్ మాల్స్‌లో నిర్వహించే క్రిస్మస్ కార్నివల్స్ టూరిస్టులకు మధురానుభూతిని కలిగిస్తాయి. పాండిచ్చేరి పాండిచ్చేరి కూడా క్రిస్మస్ ఫెస్టివల్ స్పెషల్ డెస్టినేషన్‌గా ప్రసిద్ధి. ఫ్రెంచ్ కాలనీలో జరిగే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దేశ విదేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చర్చీలన్నీ అందమైన అలంకరణలతో మెరిసిపోతాయి. ప్రత్యేక వంటకాలు, ప్రశాంత వాతావరణం క్రిస్మస్ ఆనందాన్ని మరింత పెంచుతాయి.
Details
హైదరాబాద్
ముంబై, చెన్నై, హైదరాబాద్‌తో పాటు మేఘాలయ, నాగాలాండ్, మిజోరం కూడా క్రిస్మస్ వేడుకలకు ప్రసిద్ధి. హైదరాబాద్‌లో సికింద్రాబాద్, మెదక్ చర్చీల్లో జరిగే వేడుకల్లో పాల్గొనడానికి ప్రతీ సంవత్సరం విదేశీయులు కూడా వస్తుంటారు. క్రిస్మస్ హాలిడేలో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ డెస్టినేషన్‌లలో హైదరాబాద్ కూడా ఒకటిగా నిలుస్తోంది.