LOADING...
Health: వ్యాధులు దరిచేరకుండా నూరేళ్లు జీవించాలంటే 'బ్లూ జోన్స్‌' మార్గమే సరైనది

Health: వ్యాధులు దరిచేరకుండా నూరేళ్లు జీవించాలంటే 'బ్లూ జోన్స్‌' మార్గమే సరైనది

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2026
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆరోగ్యం అనేది మంచి జీవనశైలికి ప్రతిబింబం. నూరేళ్ల వరకు ఆరోగ్యంగా జీవించాలంటే శారీరక దృఢత్వమే కీలకం. ప్రపంచవ్యాప్తంగా వందేళ్లకు పైగా జీవిస్తున్న వారు ఎక్కడ ఎక్కువగా ఉన్నారన్న అంశాన్ని పరిశీలిస్తే ముందుగా జపాన్‌లోని ఒకినావా పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత ఇటలీలోని సార్డీనియా, గ్రీస్‌లోని ఇకారియా, కోస్తారికాలోని నికోయా ప్రాంతాలు నిలుస్తాయి. ఈ ప్రాంతాలన్నింటినీ కలిసి 'బ్లూ జోన్స్' అని పిలుస్తారు. దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా, చురుకైన జీవనంతో వందేళ్ల వరకు జీవించే ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలే బ్లూ జోన్స్. ఇక్కడ నివసించే వారు ఆరోగ్యాన్ని ఒక లక్ష్యంగా కాకుండా, జీవన నాణ్యతలో భాగంగా చూస్తారు.

Details

సహజ ఆహారమే స్వీకరణ

క్యాలరీలు లెక్కపెట్టి తినడం, తరచూ డైట్‌లను మార్చడం వంటి అలవాట్లు వీరిలో ఉండవు. రోజూ ఏమి తినాలి అని ఆలోచించకుండా, ఆ సమయంలో స్థానికంగా దొరికే సహజ ఆహారాన్నే స్వీకరిస్తారు. ముఖ్యంగా కడుపు పూర్తిగా నిండకముందే భోజనం ఆపేయడం వీరి ఆహారపు అలవాట్లలో ప్రధానమైనది. దీనితో పాటు శారీరక చురుకుదనం, మానసిక ప్రశాంతత, సామాజిక అనుబంధాలు వంటి అంశాలకు కూడా వీరు సమాన ప్రాధాన్యం ఇస్తారు. నూరేళ్ల పాటు ఆరోగ్యంగా జీవించాలంటే కేవలం శరీర సంరక్షణ మాత్రమే కాకుండా, జీవన విధానంలో కొన్ని కీలక మార్పులను అలవర్చుకోవాల్సి ఉంటుంది. అవే అంశాలు ఏమిటో ఈ వీడియోలో వివరించనున్నారు.

Advertisement