LOADING...
Holi 2026: రంగులు ఒకటే కానీ.. రాష్ట్రాల వారీగా హోలీ సంబరాల ప్రత్యేకతలివే!
రంగులు ఒకటే కానీ.. రాష్ట్రాల వారీగా హోలీ సంబరాల ప్రత్యేకతలివే!

Holi 2026: రంగులు ఒకటే కానీ.. రాష్ట్రాల వారీగా హోలీ సంబరాల ప్రత్యేకతలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

హోలీ అంటే రంగుల పండుగ. చిన్నా-పెద్దా తేడా లేకుండా అందరూ ఆడిపాడే సంబరం. కులం, మతం అనే భేదాలు లేకుండా జరుపుకునే ఈ ఉత్సవం అందుకే ప్రత్యేకం. భారత్‌లోనే కాకుండా పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లో కూడా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అంతేకాదు, ఎన్ఆర్ఐలు అధికంగా ఉన్న అమెరికాలో కూడా ఈ పండుగను కలర్‌ఫుల్‌గా జరుపుకుంటారు. అయితే మన దేశంలో రాష్ట్రాలవారీగా హోలీకి ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి.

Details

బిహార్‌లో

బిహార్లో ఫాల్గుణ పౌర్ణమికి ముందు రోజు పెద్ద పెద్ద మంటలు వేయడం ఆనవాయితీ. ఇందుకు పిడకలు, ఆరాడ్, హోలీకలపతో పాటు పంటలు కోసిన తర్వాత మిగిలిన పొట్టును ఉపయోగిస్తారు. పండుగ రోజు జానపద గీతాలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటారు. పంజాబ్‌లో పంజాబ్లో సిక్కులు కూడా హోలీని ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఈ వేడుకను 'హోలా మొహల్లా' అని పిలుస్తారు. ముఖ్యంగా ఆనంద్‌పూర్ సాహిబ్లో జరిగే హోలీకి దేశవ్యాప్తంగా పేరు ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఉత్తరప్రదేశ్లోని బర్చానా హోలీకి ప్రసిద్ధి. ఇక్కడ 'రాధా రాణి' ఆలయంలో 'లాఠ్ మార్ హోలీ' నిర్వహిస్తారు. ఈ వేడుకలో వేలాది మంది సమక్షంలో మహిళలు పురుషులను కర్రలతో కొట్టడం ప్రత్యేక ఆకర్షణ.

Details

ఒడిశాలో

ఒడిశాలో కూడా హోలీని ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు-రాధ విగ్రహాల బదులుగా పూరీలోని జగన్నాథుడి విగ్రహాలను పూజించడం ఆనవాయితీ. బెంగాల్‌లో పశ్చిమ బెంగాల్లో ప్రధాన పట్టణాల వీధుల్లో శ్రీకృష్ణుడు, రాధ ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. మహిళలు నాట్యం చేస్తుంటే, భక్తులు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. ఈ రోజు 'మల్పోయే', 'కీర్ సందేష్', 'బాసంతి సందేష్' వంటి సంప్రదాయ వంటకాలతో పాటు పాయసం కూడా తయారు చేస్తారు. గుజరాత్‌లో కాలనీలు, వీధుల్లో భోగి మంటలు వేసి ప్రార్థనలు చేస్తారు. ఇలా చేస్తే చెడు దూరమవుతుందని విశ్వాసం. కొన్ని ప్రాంతాల్లో శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథుర, బృందావన్ల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పండుగకు ముందు చివరి 16 రోజులు శ్రీకృష్ణుడికి ఆరాధనలు చేస్తారు.

Advertisement

Details

అహ్మదాబాద్‌లో

అహ్మదాబాద్లో ఒక కుండలో మజ్జిగ నింపి వీధిలో వేలాడదీస్తారు. యువకులు దాన్ని పగలకొట్టేందుకు ప్రయత్నిస్తారు. అదే సమయంలో యువతులు వారిపై నీళ్లు చల్లి ఆటపట్టిస్తారు. రంగులు పడకుండా జాగ్రత్తపడేవారిని ఎగతాళి చేస్తూ, రంగులతో తడిసిన వారిని వీధుల్లో ఊరేగిస్తారు. చివరికి కుండను పగులగొట్టినవారికి 'హోలీ రాజు'గా కిరీటం వేస్తారు. నేపాల్‌లో నేపాల్లో హోలీ రోజున జాతీయ సెలవు ఉంటుంది. దేశ జనాభాలో సుమారు 80 శాతం హిందువులే. ముస్లింలు, క్రైస్తవులు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. కొందరు ఆహారం, పానీయాల్లో గంజాయి కలుపుకొని సేవిస్తారు. రంగులతో ఆడుకోవడం వల్ల తమ బాధలు పోతాయని నేపాలీల నమ్మకం.

Advertisement

Details

మహారాష్ట్రలో

మహారాష్ట్రలో హోలీని 'షింగా'గా పిలుస్తారు. పండుగకు వారం ముందు యువకులు కట్టెలు సేకరించి ఇళ్ల ముందుంచుతారు. హోలీ రోజు వాటిని ఒకచోట చేర్చి సాయంత్రం మండిస్తారు. ఇక్కడ 'పూరణ్ పోలి' అనే ప్రసిద్ధ తీపి వంటకం చేస్తారు. మణిపూర్‌లో మణిపూర్లో హోలీ ఆరు రోజుల పాటు సాగుతుంది. యువకులు తెలుపు, పసుపు రంగుల తలపాగాలు ధరిస్తారు. పండుగ రాత్రి 'తాబల్ చోంగ్బా' అనే జానపద నృత్యం ప్రదర్శిస్తారు. అమ్మాయిలతో 'గులాల్' ఆట ఆడేందుకు అబ్బాయిలు డబ్బులు ఇవ్వడం కూడా ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం.

Advertisement