Holi And Kajjikayalu: హోలీ రోజున తినే కజ్జికాయలు టర్కీ నుంచి మన దేశానికి ఎలా వచ్చింది?
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ పండుగ రాగానే, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో గుజియా అనే స్వీట్లు విపరీతంగా అమ్ముడవుతాయి.
మన తెలుగులో దీనిని కజ్జికాయలు అని పిలుస్తాం. దీని తయారీకి లోపల కోవా లేదా తురిమిన కొబ్బరిని నింపి, బయట పిండితో ముద్ద చేసి నెయ్యిలో వేయిస్తారు.
హోలీ సమీపిస్తున్న కొద్దీ, ప్రతి ఇంట్లోనూ ఈ గుజియాల (కజ్జికాయల) వాసన ఘుమఘుమలాడుతూ, పండుగ వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేస్తుంది.
రంగుల పండుగ అయిన హోలీకి, కజ్జికాయలు ప్రత్యేకంగా శుభపరిణామంగా భావిస్తారు. ఈ స్వీట్‌లో డ్రైఫ్రూట్స్, కోవా, కొబ్బరి నింపి తయారు చేస్తారు.
వివరాలు
కజ్జికాయల చరిత్ర
మౌర్యుల కాలంలో కజ్జికాయలు
పురాతన సంస్కృత గ్రంథాల ప్రకారం, "కరణిక" అనే తీపి పదార్థం ఒకప్పుడు విరివిగా వాడేవారు.
దీన్ని ఎండిన పండ్లు, తేనెతో తయారు చేసేవారని ప్రాచీన గ్రంథాలు పేర్కొన్నాయి.
మౌర్య సామ్రాజ్యం కాలంలో కూడా కజ్జికాయల తరహా స్వీట్లు వాడుకలో ఉండేవని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
శిల్పాలను పరిశీలించినప్పుడు, అప్పట్లో తయారైన కజ్జికాయలు చంద్రవంక ఆకారంలో ఉండేవని తెలుస్తోంది.
వివరాలు
టర్కీ నుంచి భారతదేశానికి
కొంతమంది చరిత్రకారుల అభిప్రాయాన్ని అనుసరించినట్లయితే, గుజియాలకు టర్కీతో కూడా సంబంధం ఉందని భావిస్తున్నారు.
టర్కీలో బక్లావా అనే స్వీట్ ఉండేది, ఇది మన కజ్జికాయల తరహాలోనే పిండితో తయారవుతూ, తేనె, చక్కెర, వెన్న వంటివి ఉపయోగించి తయారు చేసేవారు.
అప్పట్లో వ్యాపార సంబంధాలతో టర్కీ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వ్యాపారులు తరచుగా వస్తుండటంతో, వారివద్ద వచ్చిన బక్లావా స్వీట్ భారతదేశంలో మార్పులు చెంది గుజియా (కజ్జికాయలు)గా రూపాంతరం చెందిందని నమ్ముతారు.
ఉత్తరభారతంలో ఈ స్వీట్లు మొదట్లో వ్యాపించాయి.
వివరాలు
మొఘల్ యుగంలో కజ్జికాయలు
మొఘల్ రాజుల కాలంలో కూడా గుజియాలు (కజ్జికాయలు) ప్రాచుర్యంలో ఉండేవి.
కాలక్రమేణా, వీటిని కొత్త రుచుల ప్రకారం మారుస్తూ వచ్చారు. మొదట్లో ఎండిన పండ్లు, కొబ్బరి మాత్రమే ఉండేవి.
తరువాత కోవా, డ్రైఫ్రూట్స్, పంచదార మిశ్రమాలు కూడా జతచేశారు. మొఘల్ చక్రవర్తుల రాజ కుటుంబాల్లో వివాహ వేడుకలలో కూడా గుజియాలను ప్రత్యేకంగా వడ్డించేవారని తెలుస్తోంది.
బృందావనంలో కజ్జికాయల ప్రాముఖ్యత
హోలీ పండుగ సందర్భంగా బృందావనంలో కజ్జికాయలు ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. ఈ ప్రాంత ప్రజలు వీటిని విరివిగా తింటారు.
హోలీ రోజు అక్కడ ప్రతి ఇంట్లోనూ కజ్జికాయలను తయారు చేసి, స్నేహితులు, బంధువులతో పంచుకుంటారు.
వివరాలు
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో గుజియా పేర్లు
ఉత్తరప్రదేశ్ - గుజియా
బీహార్ - పెడకియా
మహారాష్ట్ర - కరంజి
తమిళనాడు - సోమాస్
కర్ణాటక - కర్జీకాయలు
నేటి తరానికి అనుగుణంగా, కజ్జికాయలలో కొత్త ప్రాయోగాలు చేసుకుంటున్నారు.
ఇప్పుడు చాక్లెట్ నింపిన కజ్జికాయలు, ఫ్యూజన్ ఫ్లేవర్స్‌తో కూడిన కజ్జికాయలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి.
హోలీ పండుగ రుచికరంగా మారడానికి, ఈ కజ్జికాయలే ప్రధాన కారణం. ఘుమఘుమలాడే వాసన, అద్భుతమైన రుచి ఈ ప్రత్యేకమైన స్వీట్‌ను అందరికీ ఇష్టమైనదిగా మార్చింది.