ప్రేరణ: ఓడిపోతానేమో అనుకుని ప్రయత్నం చేయకపోవడమే అత్యంత గొప్ప ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
మనిషి జీవితంలో ఓటమి అనేది సహజం. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్న కొద్దీ అది నిన్ను ఎక్కువగా భయపెడుతుంటుంది.
అప్పుడు నువ్వు ఓడిపోతానేమోనన్న భయంలో అసలు ప్రయత్నం చేయడమే మానేస్తావ్. దానివల్ల ఓటమి ఖచ్చితంగా నీ వశం అవుతుంది.
అయినా ప్రయత్నం చేయకుండా ఓడిపోతానని ఎందుకు భయపడుతున్నావ్. ఓడిపోతే నలుగురూ నవ్వుతారని భయపడుతున్నావా? కేవలం వాళ్ళ చిన్న నవ్వే నిన్ను ఒక పని చేయకుండా ఆపుతుందా? ఈ విషయంలో ఇంకెంత నవ్వాలో నువ్వే ఆలోచించుకో.
ఓడిపోతే నవ్వుతారని నువ్వనుకుంటున్నావ్, ప్రయత్నం చేయకపోయినా నవ్వుతారు కదా! నవ్వడం కామన్ అయినపుడు ప్రయత్నించడం మంచిదే కదా, కనీసం అనుభవమైనా వస్తుంది. దానివల్ల మరోసారి ఇంకా బాగా ప్రయత్నించవచ్చు.
Details
పనిచేస్తేనే అదృష్టం కలిసి వస్తుంది
ఓడిపోతానేమోనన్న భయం నీలో రావడానికి కారణాలేంటో ఒక్కసారి ఆలోచించావా?
వయసు పెరిగిపోతుంది కాబట్టి నువ్వు ఓడిపోతావని అనుకుంటున్నావా?
వయసు పెరుగుతున్నా పట్టు విడవకుండా పనిచేస్తూ దాని ప్రతిఫలాలు పొందుతున్న వాళ్ళు నీ చుట్టూ వందల మంది ఉంటారు. ఒకసారి వాళ్ళను గుర్తు తెచ్చుకో.
వాళ్ళది అదృష్టమని నువ్వు ఫీలవుతున్నావా? అదే నిజమనుకుందాం. కానీ ఆ అదృష్టం, వాళ్ళు పనిచేస్తేనే వచ్చింది. పని ఆపేసి ఖాళీగా కూర్చుంటే రాలేదు.
విజయం సాధించడానికి నీకు స్కిల్స్ లేవని అనుకుంటున్నావా? ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుందని నీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సి ఉంటుంది.
అందుకే ఇకనైనా కారణాలు చెప్పడం ఆపేసి, కార్యం మీద దృష్టి సారిస్తే విజయం నీ సొంతం అవుతుంది.