World Radiography Day: ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం చరిత్ర.. ఈ ఏడాది 'థీమ్'ను ఇదే..
ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని ఏటా నవంబర్ 8న జరుపుకుంటారు. రేడియోగ్రఫీ అనేది వైద్య రంగంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణ అని చెప్పాలి. రేడియోగ్రఫీని 1895లో జర్మనీలో విల్‌హెల్మ్ కాన్రాడ్ రోంట్‌జెన్ అనే శాస్త్రవేత్త X-కిరణాలను కనుగొన్నారు. రోంట్‌జెన్ అనుకోకుండా చేసిన ఒక పని రేడియోగ్రఫీ ఆవిష్కణకు నాంది పలికింది. రోంట్‌జెన్ తన ప్రయోగశాలలో కాథోడ్-రే ట్యూబ్‌తో పని చేస్తున్నప్పుడు X-కిరణాలను అనుకోకుండా గుర్తించారు. ఈ కిరణాల సాయంతో మొదట తన భార్య చేతి చిత్రాన్ని తీశారు. ఆ తర్వాత అది ఎన్నో ఆవిష్కరణలకు ఆధారమైంది. ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవంను తొలిసారిగా 2012లో నిర్వహించారు. ఈ ఏడాదికి సంబంధించిన థీమ్‌ను 'పేషెంట్ భద్రత'గా నిర్వహకులు ప్రకటించారు.
తొలిసారిగా ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని ఎవరు నిర్వహించారంటే?
ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ, రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా, అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ తొలిసారి నిర్వహించాయి. అ తర్వాత ఆనవాయితీగా కొనసాగుతోంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రేడియోగ్రఫీని ఉపయోగించి, వైద్యులు రోగి అంతర్గత వ్యాధులను కనుగొంటారు. దాని సహాయంతో X-ray, MRI, అల్ట్రాసౌండ్ పరీక్షలను చేస్తారు. X-ray సహాయంతో, దంత వ్యాధి, మామోగ్రఫీ, ఆర్థోపెడిక్ మూల్యాంకనం, చిరోప్రాక్టిక్ పరీక్షను నిర్వహిస్తారు. రేడియోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రేడియోగ్రాఫర్‌లు సాధించిన విజయాలు, సహకారాన్ని గుర్తు చేసుకుంటారు. ఈ రోజున, ఆరోగ్య సంరక్షణలో రేడియోగ్రఫీ పాత్ర గురించి అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు, సెమినార్లు, సమావేశాలను నిర్వహిస్తారు.