LOADING...
hindu mandir abu dhabi: అబుదాబిలో అతి పెద్ద హిందూ ఆలయం.. ప్రత్యేకతలు ఇవే!
అబుదాబిలో అతి పెద్ద హిందూ ఆలయం.. ప్రత్యేకతలు ఇవే!

hindu mandir abu dhabi: అబుదాబిలో అతి పెద్ద హిందూ ఆలయం.. ప్రత్యేకతలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

అబుదాబి, అరబ్‌ దేశాల్లోని ప్రముఖ నగరాల్లో ఒకటి. ఆకాశాన్నంటిన గగనచుంబీ భవనాలు, వైభవోపేతమైన కోటలు... చెప్పాలంటే అది ఒక ప్రత్యేకమైన ప్రపంచం. అటువంటి నగరంలో భక్తి, సాంస్కృతిక, సామాజిక విలువలను ప్రతిబింబించే విధంగా నిర్మించిన ఆధ్యాత్మిక కేంద్రమే 'బీఏపీఎస్‌ స్వామి నారాయణ్‌ మందిరం'. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయం పశ్చిమాసియాలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. ఈ అద్భుత కట్టడం నయనానందకరమైన శిల్పకళా వైభవానికి నిలయంగా నిలుస్తోంది.

Details

అబుదాబి ఆలయం ప్రత్యేకత

స్వామి నారాయణ్‌ ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా 1300కి పైగా ఉన్నాయి. అయితే అబుదాబిలో నిర్మించిన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. బోచా సన్వాసి అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామి నారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ ఆలయం, పురాణ ఇతిహాసాలను కళ్లకు కట్టేలా అద్భుత శిల్పాలతో అలరారుతోంది. ధ్యానకేంద్రాలు, మతపరమైన జ్ఞానాన్ని పంచే వేదికలు, మహర్షుల శిల్పాలు - అన్నీ ఈ ఆలయ ప్రత్యేకతలు.

Details

2019లో నిర్మాణం ప్రారంభం

స్వామి నారాయణ్‌ పరంపరను కొనసాగించేందుకు 'బీఏపీఎస్‌ సంస్థ' అనేక ఆలయాలను నిర్మించింది. ప్రస్తుత మహంత్‌ స్వామి మహారాజ్‌ నేతృత్వంలో ఈ ఆలయం పూర్తయింది. అయితే దీని బీజం 1997లోనే పడింది. ఆ సంవత్సరంలో ప్రముఖ్‌ స్వామి మహారాజ్‌ అబుదాబి పర్యటన సందర్భంగా ఇక్కడ ఆలయ నిర్మాణంపై ఆలోచించారు. 2015లో దుబాయ్‌ రాజు షేక్‌ మొహమ్మద్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఆలయ నిర్మాణాన్ని ఆమోదిస్తూ 27 ఎకరాల స్థలాన్ని మంజూరు చేశారు. 2019లో నిర్మాణం ప్రారంభమై 2024లో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది.

Details

ఆలయ ఆకృతి, శిల్పకళా వైభవం

ఈ ఆలయం 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో ఓ విశాలమైన కోటలా కనిపిస్తుంది. ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద త్రివేణీ సంగమాన్ని తలపించే కొలనులు ప్రత్యేక ఆకర్షణ. 402 స్తంభాలు- అన్నింటిపైనా మహర్షులు, ఆధ్యాత్మికవేత్తలు, దేవతామూర్తుల శిల్పాలు చెక్కారు. పురాణ ఇతిహాసాల ప్రతిబింబం - రామాయణం, మహాభారతం, శివ పురాణం, అరబ్‌ సంస్కృతి ప్రతిబింబం - ఒంటెలు, గుర్రాలు, ఏనుగుల శిల్పాలు. ముఖ్య దేవతామూర్తులు- స్వామినారాయణ్, గుణాతీతానంద మహారాజ్, రాధాకృష్ణ, కార్తికేయ, వినాయకుడు, శివపార్వతులు, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి, పూరీ జగన్నాథుడు, అయ్యప్ప స్వామి. ఆధ్యాత్మిక నగరంలా తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణం - ప్రార్థనా మందిరాలు, పిల్లలకు పార్క్, ఫుడ్‌కోర్ట్‌, గిఫ్ట్‌షాప్‌ వంటి ఏర్పాట్లు.

Details

 అత్యాధునిక సాంకేతికతతో ఆలయ నిర్మాణం   

400 సెన్సర్లు - భూకంపాలు, వాతావరణ మార్పులను గుర్తించే సెన్సర్లు. పర్యావరణ హితం - కాంక్రీటు, స్టీల్‌ వినియోగం లేకుండా నిర్మాణం. ప్రత్యేక రాళ్లు - రాజస్థాన్ నుంచి పింక్‌ శాండ్‌స్టోన్‌, ఇటలీ నుంచి పాలరాయి. శిల్ప కళాకారులు - రాజస్థాన్‌, కేరళ, తిరుపతికి చెందిన ప్రఖ్యాత శిల్పులు. ఆలయ దర్శనానికి ముందస్తు నమోదు అవసరం అబుదాబి - దుబాయ్‌ షేక్‌ జాయెద్‌ హైవేపై రూ. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం సోమవారం మినహా మిగిలిన రోజుల్లో భక్తులకు అందుబాటులో ఉంటుంది. దాదాపు 10,000 మంది ఒకేసారి దర్శనానికి అనుకూలం

Details

గంగా హారతి ప్రత్యేక ఆకర్షణ 

ఆలయ దర్శనానికి ముందుగా ఆన్‌లైన్‌లో పేరు నమోదు తప్పనిసరి భక్తుల సమక్షంలో ఓ ఆధ్యాత్మిక నగరం స్వామి నారాయణ్‌ ఆలయం మతసామరస్యానికి ప్రతీకగా మారింది. వివిధ దేశాల నుండి వందలాది వలంటీర్లు ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అక్షయ్‌ కుమార్‌, సంజయ్‌ దత్‌ వంటి నటులు కూడా తమ సేవలందించారు.