Idly: ఇడ్లీ పుట్టుక రహస్యం.. అసలు ఇది భారతదేశం వంటకం కాదా?
మన దేశంలో ఇడ్లీ ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకమని చెప్పొచ్చు. ఇది భారతదేశంలో పుట్టలేదని చరిత్రకారులు చెబుతున్నారు. సాధారణంగా దక్షిణాది వంటకం అని భావించినా, ఫుడ్ హిస్టోరియన్ కేటీ ఆచార్య చెప్పినట్టు, ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిన వంటగా నిర్ధారించారు. ఆ కాలంలో ఇండోనేషియాను పాలించిన హిందూ రాజులు ఉడికించే వంటకాలు చేసిన సందర్భంలోనే ఇడ్లీ తయారీ మొదలైందని తెలుస్తోంది. 800-1200 సంవత్సరాల మధ్యలో ఈ వంటకం భారతదేశంలో అడుగుపెట్టింది. తొలి భారతీయ ఇడ్లీలు కర్ణాటకలో తయారై, వాటిని 'ఇడ్డలిగే' అని పిలిచేవారని, సంస్కృతంలో 'ఇడ్డరికా' అని పిలిచినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు.
దక్షిణాదిన ప్రత్యేక వంటగా ఇడ్లీ
ఈ వంటకాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వారిలో దక్షిణ భారతదేశంలో నివసించిన అరబ్ వ్యాపారులు ఉన్నారని కూడా తెలుస్తోంది. వారు ఇక్కడి ప్రజలతో వివాహాలు చేసుకుని ఇక్కడే స్థిరపడటంతో, ఇడ్లీ దక్షిణాదికి ప్రత్యేక వంటకంగా మారింది. మొదట్లో ఇడ్లీ యొక్క ఆకారంలో కూడా మార్పులు ఉండేవి. తక్కువ మందిలో ఉపయోగించే ఈ రైస్ బాల్స్ కాలక్రమేణా గుండ్రంగా, సన్నగా మారి నేటి రూపాన్ని దాల్చాయి. కొబ్బరి చెట్నీతో తినడాన్ని కూడా కాలక్రమేణా అలవాటు చేసుకున్నారు. 8వ శతాబ్దం నుంచి ఈ వంటకం 'ఇడ్లీ'గా ప్రజాదరణ పొందుతూ దేశమంతా వ్యాపించింది. ఇడ్లీ భారతదేశంలో పుట్టకపోయినా, ఇది భారతీయుల హృదయానికి దగ్గరైన వంటకం. అంతేకాదు, ఇడ్లీకి ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఫుడ్‌గా ప్రత్యేక గుర్తింపు లభించింది.