కలుపు మొక్కలను పెరగకుండా చేసే ఈ మొక్కలను మీ గార్డెన్ లో పెంచండి
ఈ వార్తాకథనం ఏంటి
ఎవ్వరూ పెంచకుండానే పెరిగి మీకు కావాల్సిన మొక్కలు పెరగకుండా కలుపు మొక్కలు అడ్డుకుంటాయి. మీ తోటలోని మొక్కలు సరిగ్గా పెరగాలంటే కలుపు మొక్కలను తీసేయాల్సిందే.
కానీ ఒక్కో కలుపు మొక్కను తీసేస్తూ కూర్చుంటే శ్రమ, సమయం చాలా కావాలి. మరి దీనికి పరిష్కారం ఏంటి? అది తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేస్తున్నాం.
కలుపు మొక్కలు పెరగకూడదనుకుంటే కొన్ని మొక్కలను మీ తోటలో పెంచాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
క్లెమాటిస్:
ఈ మొక్కల్లో చాలా రకాలుంటాయి. కానీ నీలిరంగులో ఉండే క్లెమాటిస్ ని పెంచితే మంచిది. ఈ మొక్క, గుబురుగా పెరిగి నేలంతా పరుచుకుంటుంది.
దానివల్ల కలుపు మొక్కలు పెరగడానికి ఆస్కారం ఉండదు. మీకు శ్రమ తప్పుతుంది.
Details
నేల మీద దట్టంగా పరుచుకునే మొక్కలు
నాచు:
నేలమీద కార్పెట్ మాదిరిగా పరుచుకునే నాచు కారణంగా, సూర్యరశ్మి భూమిలోకి వెళ్ళదు. ఈ కారణంగా కలుపు మొక్కలు పెరగవు. బయటనుండి నాచు తీసుకొచ్చి మీ తోటలో మీరు పెంచవచ్చు.
క్రిమ్సన్ క్లోవర్:
ఈ మొక్కలు ఏ మట్టిలోనైనా పెరుగుతాయి. ఇవి పెరిగేచోట కలుపు మొక్కలకు చోటుండదు. ఈ మొక్కలు వసంత కాలంలో పూలను పూస్తాయి. ఈ పూలు కూడా అందంగా ఉండి ఆహ్లాదాన్ని ఇస్తాయి.
అజూగా:
కలుపు మొక్కలు, అజూగాను దాటి బయటకు రాలేవు. అంత దట్టంగా అజూగా పెరగగలదు. నేలమీద దళసరిగా పరుచుకుంటుంది. అజూగా లో చాలా రకాలున్నాయి. మీ గార్డెన్ వైశాల్యాన్ని బట్టి ఏది బాగుంటుందో అది ఎంచుకోండి.