NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / నగరాల్లో గాలి కాలుష్యాన్ని నివారించేందుకు లిక్విడ్ ట్రీస్ వచ్చేస్తున్నాయ్
    తదుపరి వార్తా కథనం
    నగరాల్లో గాలి కాలుష్యాన్ని నివారించేందుకు లిక్విడ్ ట్రీస్ వచ్చేస్తున్నాయ్
    గాలి కాలుష్యాన్ని తగ్గించే లిక్విడ్ ట్రీ

    నగరాల్లో గాలి కాలుష్యాన్ని నివారించేందుకు లిక్విడ్ ట్రీస్ వచ్చేస్తున్నాయ్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 24, 2023
    03:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గాలి కాలుష్యాన్ని నివారించడానికి మొక్కలు నాటడమనేది సరైన ప్రయత్నమని అందరికీ తెలుసు. కానీ నగరాల్లో మొక్కలు నాటడానికి స్థలం కూడా దొరకదు. మరి అక్కడ కార్బన్ డై ఆక్సైడ్ ని ఆక్సిజన్ గా మార్చాలంటే ఎలా?

    దానికోసమే లిక్విడ్ ట్రీస్ ని కనుగొన్నారు.

    అంటే:

    సెర్బియన్ సైంటిస్టులు కనుగొన్న లిక్విడ్ ట్రీ పరికరం వల్ల కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్ గా మారుతుంది. దీనికి లిక్విడ్ 3 అని పేరు పెట్టారు. ఇదొక ఫోటో బయో రియాక్టర్.

    ఇది ఎక్కడ ఉంది:

    సెర్బియాలోని బెల్ గ్రేడ్ నగరంలో స్టారిగ్రేడ్ మున్సిపాలిటీ ముందు లిక్విడ్ 3 పరికరాన్ని ఉంచారు. అచ్చం మొక్కల వలె, కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను వదులుతుంది.

    గాలి కాలుష్యం

    ఫోటో సింథసిస్ కారణంగా ఆక్సిజన్ గా మారే గాల్లోని కార్బన్ డై ఆక్సైడ్

    లిక్విడ్ 3 ఎలా పనిచేస్తుంది:

    గ్లాస్ ట్యాంక్ మాదిరిగా ఉండే ఫోటో బయో రియాక్టర్ లో 600లీటర్ల నీరు ఉంటుంది. అలాగే ఆ నీటిలో మైక్రో ఆల్గే ఉంటుంది. ఈ ట్యాంక్ పైన సొలార్ ప్లేట్ ఉండడం వల్ల చిన్న పంప్ ఆన్ ఐపోయి, ట్యాంకుకు ఉన్న చిన్న రంధ్రాలు తెరుచుకుంటాయి.

    అప్పుడు సూర్యకిరణాలు మైక్రో ఆల్గే మీద పడి ఫోటో సింథసిస్ (కిరణ జన్య సంయోగక్రియ) ప్రక్రియ జరుగుతుంది. ఈ పద్దతి కారణంగా, గాల్లో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ నీళ్ళలో కలిసిపోయి ఆక్సిజన్ గా బయటకు విడుదలవుతుంది.

    నగర ప్రాంతాల్లో మొక్కలను పెంచడం కష్టం కాబట్టి ఇలాంటి లిక్విడ్ ట్రీ ట్యాంకులను ఏర్పాటు చేసుకుంటే మంచిదని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    జీవనశైలి

    థాయ్ లాండ్ లో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా? నేపాల్
    Altered mental status: ఈ లక్షణాలు ఉన్నాయా? తేలికగా తీసుకోకండి, అది మానసిక అనారోగ్యం కావొచ్చు మెదడు
    చికెన్‌పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం జబ్బు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025