LOADING...
Mahashivratri: శివలింగ అభిషేక రహస్యం.. లోకాలను రక్షించే మహాదేవునికి ఈ రోజు ఎందుకింత ప్రాముఖ్యం? 
శివలింగ అభిషేక రహస్యం.. లోకాలను రక్షించే మహాదేవునికి ఈ రోజు ఎందుకింత ప్రాముఖ్యం?

Mahashivratri: శివలింగ అభిషేక రహస్యం.. లోకాలను రక్షించే మహాదేవునికి ఈ రోజు ఎందుకింత ప్రాముఖ్యం? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 26, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహాశివరాత్రి పర్వదినాన్ని జగత్మంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంది. 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీమంత్రాన్ని ఒక్కసారి ఉచ్ఛరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. శివుడు అభిషేకప్రియుడు కాబట్టి, నిత్యాభిషేకంతో పాటు మహాశివరాత్రి రోజున అనేక రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అర్చన చేస్తారు. శివరాత్రి ఉత్సవాలు - భిన్న సంప్రదాయాలు ప్రతి శివాలయంలో సాధారణంగా ఈ అర్చనలు జరుగుతాయి. అయితే కాల, ప్రాంత, ఆచార, ఆగమ భేదాల ప్రకారం శివరాత్రిని నిర్వహించే విధానంలో తేడా కనిపిస్తుంది. స్థానిక సంప్రదాయాలతో పాటు పౌరాణిక నేపథ్యం కూడా ఈ మార్పులకు కారణమవుతున్నట్లు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

Details

 భక్తులకో బోళాశంకరుడు 

సమస్త దేవతలలో శివుడు భక్తసులభుడు. అందుకే ఆయనను బోళాశంకరుడని, భక్త వశంకరుడని పిలుస్తారు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా హాలాహలం ఉద్భవించింది. అది మూడులకాలను దహించివేసే ప్రమాదం ఉండటంతో దేవతలు, అసురులు భయాందోళనకు గురయ్యారు. నీలకంఠుడిగా మారిన శివుడు ప్రపంచాన్ని రక్షించేందుకు శివుడు ఆ హాలాహలాన్ని మింగి, తన గొంతులో నిలుపుకున్నాడు. హాలాహల ప్రభావంతో ఆయన కంఠం నీలిరంగుగా మారింది. అందువల్ల ఆయన 'నీలకంఠుడు'గా ప్రసిద్ధి చెందారు. హాలాహలం మింగిన తర్వాత శివునిలో విపరీతమైన తాపం ఏర్పడింది. ఆ తాపాన్ని తగ్గించుకునేందుకు చంద్రుణ్ణి తలపై ఉంచుకున్నాడు. అలాగే నిరంతర తాపశమనానికి గంగను తన జటాజూటంలో ప్రవహించేలా చేసుకున్నాడు.

Details

మహాశివరాత్రి ఆచరణ 

అయినా హాలాహల తాపం శివుణ్ణి నిరంతరం బాధిస్తూనే ఉందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగిన తర్వాత శివుడు మూర్చిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంతవరకు జాగారం చేశారు. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం, జాగారం చేస్తారు. జాగారం సమయంలో శివనామ సంకీర్తన, జపధ్యానాలతో కాలక్షేపం చేస్తారు. ఇదే మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యమని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.

Details

 నేపాల్ పశుపతినాథ్ ఆలయంలో వైభవంగా ఉత్సవాలు

నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలివస్తారు. ఆలయంలో నేతితో దీపాలు వెలిగించి, ఆలయాన్ని పూర్తిగా అలంకరిస్తారు. దీపాల వెలుగుతో పశుపతినాథ్ ఆలయం మరింత అందంగా మారుతుంది. ట్రినిడాడ్‌లో లింగోద్భవ అభిషేకం ట్రినిడాడ్‌లో కూడా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగోద్భవ సమయంలో ప్రత్యేక ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా భక్తుల భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహిస్తాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.