ట్రావెల్: ఏదైనా టూర్ కి వెళ్లేముందు ఎలాంటి ప్లానింగ్ ఉండాలో తెలుసుకోండి
టూర్ కి వెళ్లాలని మీరనుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్లానింగ్, బయలుదేరే కొన్ని రోజుల ముందు నుంచే జరగాలి. లేదంటే చివర్లో మీరు కన్ఫ్యూజ్ ఐపోయి ఇబ్బంది పడతారు. ప్లానింగ్ లో ఏమేం ఉండాలో చూద్దాం. చెక్ లిస్ట్ ప్రిపేర్ చేయండి: మీ ప్రయాణానికి ఏమేం అవసరం అవుతాయో చెక్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. దాని ప్రకారం వెళ్తే ఈజీగా ఉంటుంది. ఏ విషయాన్ని మర్చిపోకుండా ఉంటారు. విదేశీ ప్రయాణాలు వెళ్తున్నట్లయితే పాస్ పోర్ట్ మీద డేట్ సరిగ్గానే ఉందా? క్రెడిట్ కార్డ్స్ సరిగా పనిచేస్తున్నాయా లేదో చెక్ చేసుకోవాలి. అలాగే కావాల్సిన క్యాష్, మెడికల్ వస్తువులు, ట్యాబ్లెట్స్ మొదలగు వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
టూర్ కి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆటోమేటెడ్ ఈ-మెయిల్: మీరెక్కడో సముద్రతీరంలో సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ మొబైల్ కి ఏదైనా కంపెనీ మెయిల్ వచ్చిందనుకోండి. అబ్బా, ఈ టైమ్ లో కూడా ఏంటీ అని అనిపిస్తుంటుంది. అందుకే ఆటోమేటెడ్ ఈ-మెయిల్ రెస్పాన్స్ ఆప్షన్ ని పెట్టండి. అదే రిప్లై ఇస్తుంది. మీకేమీ ఇబ్బంది ఉండదు. రిఫ్రిజిరేటర్ ని, కిచెన్ ని శుభ్రం చేసి వెళ్ళండి: వీటిల్లో పాడైపోయే వస్తువులుంతే మీరు ఇంటికి రాగానే చెడువాసన వస్తుంది. అందుకే ముందుగానే శుభ్రం చేయండి. వాతావరణాన్ని బట్టి వస్తువులు ప్యాక్ చేసుకోండి: మీరు వెళ్ళే ప్రదేశంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలుసుకుని, దానికి తగినట్టుగా వస్తువులను ప్యాక్ చేయండి.లేదంటే వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.