#NewsBytesExplainer: హిందూ సంప్రదాయంలో 8 రకాల వివాహాలు.. అందులో భూతశుద్ధి వివాహం ఉందా? ఈ విధంగా చేసుకునే పెళ్లిళ్లు నిషిద్ధమా!
ఈ వార్తాకథనం ఏంటి
హిందూ సంప్రదాయంలో వివాహం అంటే విశేషమైన సమర్పణ, ఒక శ్రేష్ఠమైన సంస్కారమని భావిస్తారు. షోడస సంస్కారాలలో ఒకటైన వివాహం జీవితంలో ముఖ్యమైన ఘట్టం. వివాహానికి అనేక పేర్లు ఉన్నాయి: కల్యాణం, పరిణయం, పాణిగ్రహణం, పాణిపీడనం, ఉద్వాహం, పాణిబంభం, దారోప సంగ్రహణం, దారక్రియ, దార పరిగ్రాహం, దారకర్మ మొదలైనవి.
వివరాలు
వివాహం 8 రకాలు
మనుస్మృతి ప్రకారం హిందూ ధర్మంలో వివాహం 8 రకాలుగా జరుగుతుంది: బ్రాహ్మ వివాహం: వధువును శీలవంతుడు, ధర్మపరుడు వరుడికి ఇచ్చి దానం చేస్తే బ్రాహ్మ వివాహం అవుతుంది. ఇది అత్యుత్తమమైన వివాహం అని భావిస్తారు. దైవ వివాహం: యజ్ఞంలో ఋతువికుడైన వ్యక్తికి కన్యను దక్షిణతో ఇచ్చి చేసుకునే వివాహం. ఆర్ష వివాహం: వరుడు కన్య కోసం గోవుల జంటను ఇచ్చే పద్ధతి. రుషులు అనుసరించే సంప్రదాయ విధానం. ప్రాజాపత్య వివాహం: వధూవరులు కలసి ధర్మాన్ని అనుసరించాలని నిర్ణయించి, కన్యాదానం చేస్తే ప్రాజాపత్య వివాహం అవుతుంది. ఉదాహరణగా సీతారాముల వివాహం.
వివారాలు
వివాహం 8 రకాలు
అసుర వివాహం: డబ్బు లేదా ఇతర ప్రవర్తన ఆధారంగా వధువును వరుడు కొనుగోలు చేస్తే, దాన్ని అసుర వివాహం అంటారు. ఉదాహరణ: కైకేయిని దశరథుడు చేసుకున్నది. గాంధర్వ వివాహం: ఇద్దరూ పరస్పర అనురాగంతో, ఏ విధమైన మంత్రపూజ లేకుండా చేసుకునే వివాహం. ఉదాహరణ: శకుంతలా-దుష్యంతుల వివాహం. రాక్షస వివాహం: యుద్ధం ద్వారా వధువును ఎత్తుకెళ్లి చేసుకునే వివాహం. ఉదాహరణ: రామాయణంలో రావణుడు మండోదరిని తీసుకెళ్లిన విధానం. పైశాచ వివాహం: వధువు నిద్రలో లేదా అచేతనంగా ఉన్నప్పుడు, ఆమెకు తెలియకుండా చేసుకునే వివాహం.
వివరాలు
మనుస్మృతిలో పేర్కొన్న ఈ 8 వివాహాల్లో...
బ్రాహ్మ వివాహం శ్రేష్ఠం ప్రాజాపత్యం ధర్మబద్ధం రాక్షసం, పైశాచం నిషిద్దం వీటితో వేదకాలంలో వివాహాలు జరిగేవి. ఆధునిక కాలంలో పెద్దలు కుదిర్చిన వివాహం (arranged marriage), ప్రేమ వివాహం (love marriage) ప్రాథమికంగా అనుసరిస్తున్నారు. డిసెంబర్ 1న సమంత భూతశుద్ధి వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అసలు హిందూ సంప్రదాయంలో భూతశుద్ధి వివాహం అనే రకం లేదు.
వివరాలు
మనుస్మృతిలో పేర్కొన్న ఈ 8 వివాహాల్లో...
భూతశుద్ధి వివాహం అనేది ఈశా ఫౌండేషన్ ప్రవేశపెట్టిన ఆధునిక ఆధ్యాత్మిక వివాహ విధానం. ఇది పంచభూతాలను శుద్ధి చేసి, వధూవర బంధాన్ని బలోపేతం చేస్తుందని నమ్మకం ఉన్న విధానం. మనుస్మృతి అనేది 2,000 సంవత్సరాల క్రితం రుషి మనువు రాసిన ప్రాచీన హిందూ ధర్మ నియమావళి. ఇందులో 12 అధ్యాయాలు, 2,684 శ్లోకాలు ఉన్నాయి. గృహ, సామాజిక, మతపరమైన నియమాలన్నీ ఇందులో ఉన్నాయి. స్త్రీలకు ఉన్నత స్థానం ఇచ్చిందని, పితృస్వామ్యాన్ని బలపరిస్తుందని వాదనలు ఉన్నాయి. వివాహ వ్యవస్థ, కైకలిక నియమాలు వంటి అంశాలు మనుస్మృతిలో వివరంగా ఉన్నాయి.