2026 New Year Resolution : గుండె జబ్బులకు చెక్ పెట్టే సులభమైన మార్గాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
2025 ముగింపు దశకు చేరుకుంటున్న వేళ 2026 సంవత్సరానికి కొత్త రిజల్యూషన్లు తీసుకునేందుకు ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏడాది మనం తీసుకునే నిర్ణయాల్లో జీవనశైలి మార్పులు ముఖ్యమైనవిగా ఉంటాయని, కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆరోగ్యంగా ప్రారంభించాలంటే తప్పనిసరిగా కొన్ని 'హార్ట్ హెల్తీ' అలవాట్లను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.
Details
గుండె ఆరోగ్యంపై ఎందుకు దృష్టి పెట్టాలి?
గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకు అవసరమో డాక్టర్ భమ్రే వివరించారు. 2025 నాటికి గుండె జబ్బులు అతిపెద్ద ఆరోగ్య సమస్యగా మారాయని, ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఇవి ఏ ఒక్క వయసు వర్గానికే పరిమితం కావడం లేదని తెలిపారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్‌తో కూడిన గుండె సమస్యలు, అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వంటి ప్రమాదాలు అన్ని వయస్సుల వారిలో వేగంగా పెరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం 25 నుంచి 75 ఏళ్ల వయస్సు వారిలో ఛాతీలో అసౌకర్యం, నడిచేటప్పుడు ఆయాసం, నిరంతర అలసట, పాదాల్లో వాపు, తల తిరగడం, ఎసిడిటీలా అనిపించే ఛాతీ నొప్పి లేదా గుండె దడ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు.
Details
2026 కోసం 5 గుండె-ఆరోగ్యకరమైన నియమాలు
ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే అవి గుండెపోటు, స్ట్రోక్ లేదా దీర్ఘకాలిక గుండె నష్టానికి దారితీయవచ్చని హెచ్చరించారు. అందుకే జీవనశైలిలో వెంటనే మార్పులు చేసుకోవడం చాలా అవసరమన్నారు. రాబోయే ఏడాదిలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు డాక్టర్ భమ్రే ఐదు ముఖ్యమైన నియమాలను సూచించారు. ఇవి ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, నిద్ర, క్రమమైన వైద్య పరీక్షలను కవర్ చేస్తాయి.
Details
1. కదలండి (వ్యాయామం)
వాకింగ్, సైక్లింగ్, యోగా లేదా సాధారణ హోమ్ వర్కౌట్స్ వంటి వ్యాయామాలు కొలెస్ట్రాల్, రక్తపోటు, బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం 45 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచించారు. 2. సరిగ్గా తినండి పండ్లు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీలు, ఆపిల్స్, నారింజ, కివి, బొప్పాయి కూరగాయలు: పాలకూర, బ్రోకలీ, క్యారెట్లు, టొమాటోలు, బీట్‌రూట్, బీన్స్ నట్స్ & సీడ్స్: బాదం, వాల్‌నట్స్, పిస్తా, అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడికాయ గింజలు
Details
3. రాత్రి బాగా నిద్రపోండి
అలాగే చేపలు, వాల్‌నట్స్ నుంచి లభించే ఒమేగా-3 కొవ్వులు, ఓట్స్, కూరగాయల నుంచి ఫైబర్, పాలకూర, చిలగడదుంప నుంచి పొటాషియం, బెర్రీలు-టొమాటోల నుంచి యాంటీఆక్సిడెంట్లు, నట్స్-తృణధాన్యాల నుంచి మెగ్నీషియం, సిట్రస్ పండ్ల నుంచి విటమిన్ సీ వంటి పోషకాలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వేయించిన ఆహారాలు, అధిక చక్కెర, ఎక్కువ ఉప్పు వాడకాన్ని తగ్గించాలని సూచించారు. సరైన నిద్ర లేకపోతే అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలని సూచించారు. రాత్రి 10 గంటలలోపు పడుకొని, రోజుకు కనీసం 8-9 గంటల నిద్ర తీసుకుని, ఉదయం 6-7 గంటల మధ్య మేల్కొనడం మంచిదన్నారు.
Details
4. ఒత్తిడిని నియంత్రించండి
డీప్ బ్రీథింగ్, ధ్యానం, పెయింటింగ్, తోటపని లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం వంటి అభిరుచులు ఒత్తిడిని తగ్గిస్తాయని చెప్పారు. పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని సూచించారు. 5. క్రమం తప్పకుండా చెకప్స్ చేయించుకోండి రక్తపరీక్షలు, ఈసీజీ, రక్తపోటు చెకప్స్ ద్వారా ప్రారంభ దశలోనే సమస్యలను గుర్తించి సకాలంలో చికిత్స పొందవచ్చని తెలిపారు. 30 ఏళ్లు దాటినవారు లేదా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా అవసరమన్నారు. ఈ సులభమైన అలవాట్లను రోజువారీ జీవితంలో అమలు చేస్తే, 2026ను ఆరోగ్యంగా, హృదయం హుషారుగా ప్రారంభించవచ్చని డాక్టర్ బిపించంద్ర భమ్రే స్పష్టం చేశారు