Page Loader
Paralysis: పక్షవాతం వచ్చే ముందు కనిపించే ముందస్తు సంకేతాలివే!
పక్షవాతం వచ్చే ముందు కనిపించే ముందస్తు సంకేతాలివే!

Paralysis: పక్షవాతం వచ్చే ముందు కనిపించే ముందస్తు సంకేతాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2025
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

పక్షవాతం అనేది శరీరంలో కొన్ని భాగాలు పని చేయడం ఆగిపోవడం వల్ల ఏర్పడే వ్యాధి. ఇది మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళాల్లో సమస్యల వల్ల జరుగుతుంది. ఈ పరిస్థితి శరీరాన్ని ఒక్కసారిగా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఒక వైపు చేయి, కాలు, నోరు, కన్ను ప్రభావితమవుతాయి. రక్తపోటు, డయాబెటిస్, లావుగా ఉన్నవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ. ఆహారపు అలవాట్లను మెరుగుపరచడం, వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించడం ద్వారా పక్షవాతాన్ని నివారించవచ్చు.

Details

పక్షవాతానికి ముందుగా కనిపించే లక్షణాలు

పక్షవాతానికి ముందుగా కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. ముఖ్యంగా చిన్న పక్షవాతం (TIA) లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. 1. మాట్లాడటంలో ఇబ్బంది 2. కంటి చూపు మందగించడం 3. శరీరంలో ఒక భాగం తాత్కాలికంగా బలహీనపడడం 4. తిమిరి పట్టినట్లుగా అనిపించడం పక్షవాతానికి కారణాలు ఈ వ్యాధిని బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా పిలుస్తారు. మెదడుకు రక్తసరఫరా చేసే ధమనుల్లో బ్లాకులు ఏర్పడటమే ప్రధాన కారణం. 85శాతం పక్షవాతం కేసులు రక్తనాళాల బ్లాకుల వల్ల జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆందోళన ఎక్కువగా ఉండే వ్యక్తులు కూడా ఈ సమస్యకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.

Details

 పక్షవాతం వచ్చినప్పుడు కనిపించే ప్రధాన లక్షణాలు 

1. శరీరంలోని ఒక వైపు ఎక్కువ ప్రభావం చూపుతుంది. 2. నడవడం, మాట్లాడటం, రాయడం, లేదా శరీరాన్ని కదిలించడం కష్టమవుతుంది. 3. కంటి చూపు తగ్గిపోవడం లేదా శరీరంలోని కొన్ని భాగాలు పనికిరాకపోవడం జరుగుతుంది. నివారణ చిట్కాలు 1. ఆహారపు అలవాట్లు మెరుగుపరచడం: పోషకాహారం తీసుకోవడం. 2. రక్తపోటు, డయాబెటిస్ నియంత్రణ: మెడికల్ చెకప్‌లు చేయించుకోవడం. 3. వ్యాయామం: రోజువారీ వ్యాయామం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. 4. ధూమపానం, మద్యం త్యాగం: ఇవి అనారోగ్య సమస్యలను మరింత పెంచుతాయి. 5. ఒత్తిడిని తగ్గించుకోవడం: ధ్యానం, యోగా లాంటి పద్ధతులు పాటించడం.

Details

డాక్టర్ ను సంప్రదించాలి

కాళ్లు, చేతులు ఉరికురికే తిమిరి అనిపించడం వంటి చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఇలాంటి సమస్యలు ఎదురైన వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. వీటిని ప్రారంభ దశలో గుర్తిస్తే, సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చు. పక్షవాతాన్ని ముందు నుంచి నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం.