Krishna Janmashtami 2023: చిన్ని కృష్ణుడికి ఇష్టమైన పిండి వంటలు ఇవే.. మీరు మీ పిల్లలకు అందించండి!
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీ కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టమని అందరికి తెలుసు.అందుకే క్రిష్ణుడు జన్మించిన కృష్ణ జయంతి రోజున దాన్నే నైవేద్యంగా పెడతారు.
కృష్ణాష్టమి రోజున పిల్లలను బుడిబుడి అడుగులతో ఇంటికి ఆహ్వానించి కమ్మ అటుకులతో, వెన్నతో ఈ వంటలు చేసి పెడితే సరిపోతుంది.
పల్లీ అటుకుల లడ్డు విధానం
పాన్లో పల్లీలు, అటుకులు వేగించిన తర్వాత నువ్వులు వేసి ఎర్రగా వేగించాలి. వేగించిన అటుకులను మెత్తటి పౌడర్ చేయాలి. ఇక పల్లీలు, నువ్వులు పొడిచేశాక దాంట్లో బెల్లం చేసి మిక్సీ పట్టాలి.
ఆమిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అటుకుల పొడి, యాలకులపొడి వేసి గట్టిగా కలపాలి. తర్వాత గట్టిగా లయాలు చుట్టాలి.కష్టమైతే కొన్ని నీళ్లు లేదా నెయ్యి వేసి కలుపుతూ లడ్డూ చేస్తే సరిపోతుంది.
Details
అరటి పండు రవ్వ కేసరి తయారు చేయు విధానం
అటుకులు కొబ్బరి పొంగలి
అటుకులను జల్లెడలో వేసి నీళ్లు పోసి తడపి అరగంట సేపు పక్కనబెట్టాలి. కడాయిలో బెల్లం వేసి పావుకప్పు నీళ్లు పోసి కరిగించి తర్వాత వడకబెట్టిన తర్వా కొబ్బరి తురుము వేయాలి.
తర్వాత అటుకులు వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. మరో కడాయిలో జీడిపప్పు, ద్రాక్ష వేగించాలి. వాటిని అటుకులపొంగలిలో వేసి కలిపితే అటుకుల కొబ్బరి పొంగలి తయారైపోతోంది.
అరటిపండు రవ్వ కేసరి
బాండీలో నెయ్యి జీడిపప్పు, ద్రాక్ష వేగించాలి. అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేడిచేయాలి. తర్వాత అరటి పండ్ల ముక్కలు వేసి గరిటెతో పంచదార పాలుపోసి ఉడికించాలి. చివర్లో జీడిపప్పు, ద్రాక్ష, నానబెట్టిన బాదంతో గార్నిష్ చేస్తే అరటి పండు రవ్వ కేసరి రెడీ.