LOADING...
Motivation: లక్ష్మీదేవి ఇష్టపడే ఇల్లు ఇవే!
లక్ష్మీదేవి ఇష్టపడే ఇల్లు ఇవే!

Motivation: లక్ష్మీదేవి ఇష్టపడే ఇల్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య చాణక్యుడు మహాపండితుడు. తన నీతి శాస్త్రం ద్వారా ఆయన నేటి తరానికీ అనేక విలువైన బోధనలు అందించారు. చాలామంది ఎంత డబ్బు సంపాదించినా, వారి ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుంటాయి. అసలు లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుందో చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. చాణక్యుని ప్రకారం పరిశుభ్రత ఉన్న ఇంటిలోనే లక్ష్మీదేవి నివసిస్తుందట. మురికి, చెల్లాచెదురుగా ఉన్న వస్తువులు, అశుభ్రమైన వాతావరణం లక్ష్మీదేవిని దూరం చేస్తాయి. పరిశుభ్రత లోపిస్తే వ్యాధులు, ప్రతికూల శక్తులు చేరుతాయని ఆయన హెచ్చరించాడు. అలాగే కుటుంబంలో అందరూ ఒకరినొకరు గౌరవించుకునే వాతావరణం ఉంటేనే లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుందని చెప్పారు.

Details

విద్య, జ్ఞానం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది

ప్రతిరోజూ తగాదాలు, దుర్భాషలు, కోపం ఉన్న ఇంట్లో ఆనందం ఉండదని, లక్ష్మీదేవి నివసించదని చాణక్యుడు సూచించాడు. చాణక్యుడు విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాడు. ఆయన ప్రకారం, విద్య, జ్ఞానం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది. విద్యావంతుడు, తెలివైన వ్యక్తి కుటుంబానికి మార్గదర్శకుడిగా ఉంటాడు. అలాంటి జ్ఞానవంతుడి వద్ద లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుందని చాణక్య నీతి చెబుతోంది.