New Year's Resolutions: ఈసారి న్యూఇయర్ రెజల్యూషన్స్ ఎలా ఉండాలంటే..!
ఈ వార్తాకథనం ఏంటి
నూతన ఏడాదిలోకి అడుగుపెట్టేముందు ప్రతి ఒక్కరూ కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటారు.
చెడు అలవాట్లను విడిచిపెట్టి, మంచి అలవాట్లను స్వీకరించడానికి ఇది సరైన సమయం.
ఈ కొత్త సంవత్సరంలో కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుటుంబం కోసం సమయాన్ని కేటాయించండి
కుటుంబ బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రియమైన వారి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తే ఆ బంధం మరింత బలపడే అవకాశముంది.
పిల్లలతో ఎక్కువ సమయం గడపడం అలవాటు చేసుకోవాలి.
మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి
మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.జీవితంలో ముఖ్య నిర్ణయాలు తీసుకొనే ముందు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
కొంత శాంతిని పొందేందుకు ప్రతి రోజూ ధ్యానం చెయ్యండి.
Details
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ఆరోగ్యం
మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కనీసం రోజూ ఏడు గంటలు నిద్రపోవాలి.
ముఖ్యంగా రాత్రిపూట, రోజులో 8 గ్లాసులు నీరు తాగాలి. శరీరం కోరినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి.
పనితో పాటు జీవితాన్ని ఆస్వాదించాలి
నూతన ఏడాదిలో మీ పని, విశ్రాంతి సమయాల మధ్య సమతుల్యతను పాటించాలి.
పరిస్థితి ఎలా ఉన్న మీరు మీ జీవితాన్ని ఆనందించాలి.
చిన్న, చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి.
వ్యాయామం
శరీరాన్ని ధృఢంగా ఉంచుకోవాడానికి వ్యాయామం తప్పనిసరి. ప్రతి రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.
శరీరం ఫిట్‌గా ఉండటానికి వ్యాయామం అవసరం.