LOADING...
Motivation: వైవాహిక జీవితం సుఖంగా సాగాలంటే భార్యలో ఉండాల్సిన గుణాలివే! 

Motivation: వైవాహిక జీవితం సుఖంగా సాగాలంటే భార్యలో ఉండాల్సిన గుణాలివే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అసాధారణ మేధావి, గొప్ప తత్వవేత్త. తన కాలంలో జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన ఈయన అనుభవాల ద్వారా నేటి తరాలకు అనేక విలువైన బోధనలు అందించారు. ముఖ్యంగా బంధాలు, బంధుత్వాలు, స్త్రీ యొక్క గుణాలు, భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండే లక్షణాలు వంటి అనేక అంశాలపై ఆయన లోతైన విశ్లేషణ చేశారు. చాణక్యుడు తన ఉపదేశాల్లో ఇలా స్పష్టంగా పేర్కొన్నాడు. భార్య భర్తతో సంతోషంగా ఉండాలంటే కొన్ని మంచి లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి.

Details

ప్రేమతో వ్యవహరించాలి

ఏ స్త్రీ అయితే తన భర్త పట్ల ఎల్లప్పుడూ మర్యాదగా, దయతో, ప్రేమతో వ్యవహరిస్తుందో, ఆ స్త్రీ ఎప్పటికీ తన భర్త ప్రేమను పొందుతుందంట. అటువంటి స్త్రీ ఉన్న ఇంట్లో వైవాహిక జీవితం సుఖశాంతులతో నిండిపోతుందన్నాడు. అలాగే ఏ స్త్రీ అయితే ఆచార సంప్రదాయాలను గౌరవించి వాటిని నిబద్ధతతో పాటిస్తుందో, ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషం, ఐకమత్యం నిలుస్తుందని చాణక్యుడు చెప్పాడు. ఆచారాలకు విలువనిచ్చే మహిళ ఉండే ఇంట్లో శాంతి, ఆనందం స్థిరంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డాడు.

Details

డబ్బు అవసరాలను ఆర్థం చేసుకోవాలి

ఇంకా ఆయన చెప్పిన మరో ముఖ్యమైన అంశం, డబ్బు విషయంలో వివేకం అవసరం. ఏ స్త్రీ అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటుందో, అనవసర ఖర్చులు చేయకుండా కుటుంబ అవసరాలను బాగా అర్థం చేసుకుంటుందో, ఆ ఇంట్లో ఆకలికేకలు వినిపించవంటని చాణక్యుడు హెచ్చరించాడు. అటువంటి స్త్రీ ఉండే ఇంటికి పేదరికం దరిచేరదని ఆయన స్పష్టం చేశాడు. మొత్తానికి, చాణక్యుడు తెలిపినట్లు మర్యాద, ఆచారపరత, ఆర్థిక సంయమనం ఉన్న స్త్రీ ఎల్లప్పుడూ తన కుటుంబాన్ని సుఖసంతోషాలతో నింపుతుంది.