LOADING...
Motivation: జీవితంలో ఎదగాలంటే ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి
జీవితంలో ఎదగాలంటే ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి

Motivation: జీవితంలో ఎదగాలంటే ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న మహామేధావి ఆచార్య చాణక్యుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో ప్రధానమంత్రిగా సేవలందించిన ఆయన, రాజకీయ మేధస్సుకు ప్రతీకగా నిలిచాడు. చాణక్యుడిని కౌటిల్య, విష్ణుగుప్త అని కూడా పిలుస్తారు. చతుర్విధ పురుషార్థాలలో రెండవదైన 'అర్థపురుషార్థం' గురించి ఆయన రచించిన 'అర్థశాస్త్రం' నేటికీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. కేవలం అర్థశాస్త్రం మాత్రమే కాకుండా రాజనీతి శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం వంటి విభాగాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. అదే సమయంలో ఆయన రచించిన నీతిశాస్త్రం, చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. సంస్కృతంలో ఆయన చాణక్య నీతి దర్పణం అనే పుస్తకాన్ని కూడా రచించారు. నేటికీ ఆయన చెప్పిన నీతికథలు జీవితంలో ఆచరణలో ఉన్నాయి.

Details

విజయానికి మార్గం - చాణక్య బోధనలు 

పెద్దలను గౌరవించి, వారి మాటలకు విలువనిచ్చే వారు నిజమైన తెలివైనవారని ఆయన అన్నాడు. అలాంటి వారు ఇతరులలో లోపాలను వెతకరు, ప్రతి ఒక్కరినీ ప్రేమించే స్వభావం కలిగి ఉంటారు. ధైర్యం ఉన్నవారు తమ లక్ష్యాల పట్ల అంకితభావంతో కట్టుబడి ఉంటారని ఆయన విశ్లేషించాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం తెలివైన వ్యక్తుల ప్రత్యేకత అని చాణక్యుడు పేర్కొన్నాడు.

Details

టీమ్‌వర్క్‌, తార్కికతపై నమ్మకం 

చాణక్య నీతి ప్రకారం తెలివైన వ్యక్తులు ఎల్లప్పుడూ టీమ్‌వర్క్‌ మీద విశ్వాసం ఉంచుతారు. అందువల్ల వారు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇలాంటి వారు ఇతరుల కంటే ఎక్కువ 'తార్కిక సామర్థ్యం' కలిగి ఉంటారు. చదువులోనూ లోతైన జ్ఞానంతో, పండితులను సైతం ఓడించగల శక్తి కలిగినవారని ఆయన అభివర్ణించాడు. అయితే ఒక ముఖ్యమైన అంశాన్ని ఆయన హెచ్చరించాడు ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఎందుకంటే మంచినీ సలహా ఇస్తే చాలామంది దాన్ని స్వీకరించరు, పైగా అవసరం లేదంటూ కౌంటర్ ఇస్తారు. అందుకే ఎవరికి సలహా ఇవ్వాలో ముందుగా ఆలోచించాలి అని ఆయన స్పష్టం చేశాడు.

Details

కష్టాలపై చాణక్య బోధ 

మనిషి జీవితం కష్టాల్లేక సాగదని చాణక్యుడు వివరించాడు. ఎప్పటికైనా కష్టాల సుడిగుండం ఎదురవుతుంది. కానీ ఆ కష్టాలను మనిషి ఎంత తొందరగా గుర్తిస్తే, వాటిని అంత త్వరగా ఎదుర్కొని బయటపడగలడని ఆయన చెప్పారు. మంచి లక్షణాలపై దృష్టి ఏ మనిషీ పరిపూర్ణుడు కాదని, అందుకే బంధువులు, మిత్రులు లేదా సహచరులలో చెడు గుణాల కంటే **మంచి లక్షణాలపై దృష్టి పెట్టాలని చాణక్యుడు సూచించాడు. ఉద్యోగం చేసే చోట సహోద్యోగులను గౌరవించాలి. వారి లోపాలను మాత్రమే లెక్కపెట్టి వారిని నిరుత్సాహపరచకూడదు. బదులుగా ఆ లోపాలు మళ్లీ పునరావృతం కాకుండా వారిని సిద్ధం చేయడం ఉత్తమం. అలా చేస్తే కలిగే సంతృప్తి ప్రత్యేకమైనదని ఆచార్య చాణక్యుడు బోధించాడు.