LOADING...
Christmas: ప్రపంచంలోని ఈ దేశాల్లో క్రిస్మస్ ను జరుపుకోరు.. ఎందుకంటే? 
ప్రపంచంలోని ఈ దేశాల్లో క్రిస్మస్ ను జరుపుకోరు.. ఎందుకంటే?

Christmas: ప్రపంచంలోని ఈ దేశాల్లో క్రిస్మస్ ను జరుపుకోరు.. ఎందుకంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రిస్మస్ క్రైస్తవ మతస్థులకు అత్యంత ప్రీతికరమైన పండుగ. ఈ రోజున యేసు ప్రభువు పుట్టినదని విశ్వాసం, కాబట్టి ప్రజలు చర్చిలో ప్రార్థనలు చేసి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో పండుగ కోసం రోజులు ముందే ప్రత్యేకంగా సన్నాహాలు జరుగుతాయి. ఈ రోజు బహుమతులు ఇచ్చే సంప్రదాయం, చిన్నారులు శాంతా క్లాజ్ నుంచి గిఫ్ట్స్ పొందడం, పిల్లల ఉత్సాహం ఈ పండుగను ప్రత్యేకంగా చేస్తాయి. కానీ ప్రపంచంలోని అన్ని దేశాల్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకోబడవు. కొన్ని దేశాల్లో మతపరమైన కారణాల వల్ల ఈ పండుగను సెలవుదినంగా కూడా ప్రకటించలేదు.

Details

క్రిస్మస్ జరుపుకోని కొన్ని దేశాలు 

ఆఫ్ఘనిస్తాన్: ఇక్కడ క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువ, మతపరమైన కారణాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోరు. ఇరాన్: ఇస్లామిక్ దేశంగా ఇక్కడ క్రిస్మస్ జరుపుకోవడంపై నిషేధం ఉంది. భూటాన్: దేశంలో 75 శాతం మంది బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నారు. కేవలం 1 శాతం ప్రజలు క్రైస్తవులు. అందువల్ల క్రిస్మస్ పెద్ద ప్రాధాన్యం పొందదు. సోమాలియా: మతపరమైన కారణాల వల్ల బహిరంగంగా క్రిస్మస్ జరుపుకోవడం నిషేధించబడింది. పండుగను వ్యక్తిగతంగా మాత్రమే జరుపుకోవాలి. పాకిస్తాన్: డిసెంబర్ 25 పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా జన్మదినం కావడంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోరు, అయినప్పటికీ పబ్లిక్ హాలీడే.

Details

సెలవు దినంగా గుర్తించలేదు

అంతేకాక ఉత్తర కొరియా, లిబియా, మౌరిటానియా, సహ్రావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సౌదీ అరేబియా, తజికిస్తాన్, ట్యునీషియా, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, యెమన్ వంటి దేశాలు కూడా క్రిస్మస్‌ను ప్రభుత్వ సెలవు దినంగా గుర్తించలేవు. ఇలా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మత, చారిత్రక, సాంప్రదాయ కారణాల వల్ల క్రిస్మస్ ప్రత్యేకంగా జరుపుకోబడదు, కానీ క్రైస్తవులు ఇతర దేశాలలో ఘనంగా ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు

Advertisement