ఫారెన్ ట్రిప్ అనుభూతిని ఇండియాలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలు వెళ్ళాల్సిందే
ఈ వార్తాకథనం ఏంటి
ఫారెన్ లో పర్యాటక ప్రదేశాలు బాగుంటాయని ప్రతీ ఒక్కరూ అక్కడికి వెళ్లాలని అనుకుంటారు. కానీ ఎంతమందికి తెలుసు? ఇండియాలోనూ అంతకంటే మంచి పర్యాటక ప్రాంతాలున్నాయని. ప్రస్తుతం ఫారెన్ ట్రిప్ అనుభూతినిచ్చే ఇండియా ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
షిల్లాంగ్: తూర్పు తీర స్కాట్లాండ్ గా పిలవబడే ఈ ప్రదేశంలో పర్యాటక స్థలాలు చాలా ఉన్నాయి. ఉరికే జలపాతాలు, కళ్ళు తిప్పుకోలేని అందాలతో ఉండే సరస్సులు, కళ్ళు తిరిగేలా కనిపించే లోయలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
అలెప్పీ: కేరళలోని ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్, వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ గా పిలిచేవారు. బ్యాక్ వాటర్ లో పడవ ప్రయాణాలు, అబ్బురగొలిపే సముద్ర తీరాలు, పచ్చటి వాతావరణం.. చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
పర్యాటకం
ఫారెన్ ని తలపించే ఇండియాలోని పర్యాటక ప్రాంతాలు
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్: కాలిఫోర్నియాలోని ఆంటిలోప్ వ్యాలీ గురించి మీకు తెలిస్తే, అలాంటి అనుభూతిని పొందడానికి ఉత్తరాఖండ్ లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి వెళ్ళండి. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడ్డ ఈ ప్రాంతం, సముద్రమట్టం నుండి చాలా ఎత్తులో ఉంటుంది.
కజ్జియార్: స్విట్జర్లాండ్ తాలూకు చల్లని అనుభూతిని పొందాలంటే హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఉన్న కజ్జియార్ కి వెళ్ళండి. ఇక్కడ మంచుతో కప్పబడి ఉన్న హిమాలయ పర్వతాలు దర్శనమిస్తాయి. మంచు కురవడాన్ని చూడాలనుకుంటే అక్టోబర్-మార్చ్ మధ్యలో వెళ్ళండి.
అండమాన్ నికోబార్ దీవులు: మాల్దీవ్స్ కి వెళ్ళే బదులు అండమాన్ దీవులకు వెళ్ళవచ్చు. ఇక్కడ రిసార్ట్స్, హోటల్స్ అన్నీ ఉన్నాయి.