మిరియాల వల్ల ఇన్ని ఉపయోగాలా.. రోజూ తీసుకుంటే ఈ వ్యాధులు దరిచేరవు..!
మిరియాలను ప్రతిరోజూ ఆహరంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మిరియాల్లోని 'పెపరిన్' అనే రసాయనం ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరిపిస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఫలితంగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీటి వల్ల విటమిన్లు B, C సెలీనియం, బీటా-కెరోటిన్ వంటి అవసరమైన పోషకాల పోషణను మెరుగుపరుస్తుంది. నల్ల మిరియాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరిపిస్తుంది. దీంతో ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సాధారణ జీర్ణ సమస్యలను నివారిస్తుంది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి, చెడు బ్యాక్టీరియాను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి.
నల్ల మిరియాలతో బరువు కంట్రోల్
మిరియాలలో విటమిన్ సి, విటమిన్ ఎ, ప్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఘాటైన వాసన, రుచిని ఇస్తుంది. దీనివల్ల శరీరంలోని హానికర ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గానూ ఈ మిరియాలు పనిచేయనున్నాయి. చిన్న వయస్సులో వృద్ధాప్య ఛాయలు రాకుండా కూడా ఈ మిరియాలు అడ్డకుంటాయి. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్, పెద్ద పేగు క్యాన్సర్ కణాల పునరుత్పత్తిని పైపరైన్ తగ్గించి, క్యాన్సర్ కణాలు చనిపోయేలా చేసినట్లు ఇటీవల ప్రయోగాల్లో తేలింది. నల్ల మిరయాలు జీవక్రియను మెరుగుపరచడంతో కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు కూడా కంట్రోల్ అవుతుంది. మిరియాలలోని ఔషద గుణాలు దగ్గు, శ్వాసకోశ రద్దీ, సైనసిటిస్ వంటి శ్వాసకోశ లక్షణాలను తగ్గించడంతో సహాయపడుతుంది.