బ్యాచిలరెట్టే పార్టీ ఎక్కడ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇండియాలోని ఈ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి.
పెళ్లంటే ప్రతీ ఇంట్లో హడావిడి ఉంటుంది. వచ్చే బంధువులు, స్నేహితులతో ఇల్లంతా కళకళలాడిపోతుంది. ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. ఈ క్రమంలో బ్యాచిలర్, బ్యాచిలరెట్టే పార్టీలను కూడా వివిధ రకాల ప్రదేశాల్లో చేసుకుంటున్నారు. ప్రస్తుతం బ్యాచిలరెట్టే పార్టీలకు అనుకూలంగా ఉండే ఇండియాలోని ప్రాంతాలు ఏంటో తెలుసుకుందాం. హావ్ లాక్-అండమాన్ దీవులు: ఇండియాలోని అందమైన బీచులు అండమాన్ దీవుల్లోని హావ్ లాక్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతం బ్యాచెలరెట్టే పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. బీచ్ లో కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తూ, మీ గ్రూప్ తో కలిసి నచ్చిన డ్రింక్ తాగుతూ ఉంటే ఆ కిక్కే వేరు. సిటీ తాలూకు గందరగోళం నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రదేశం బాగుంటుంది.
ఉదయ్ పూర్-రాజస్థాన్
బ్యాచిలరెట్టే పార్టీ రాయల్ గా ఉండాలనుకుంటే ఉదయపూర్ వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలో, పాతకాలం నాటి రాజభవనాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బోట్ రైడింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. బిర్-హిమాచల్ ప్రదేశ్: బ్యాచిలరెట్టే పార్టీకి అడ్వెంచర్ ని జోడించాలనుకుంటే హిమాచల్ ప్రదేశ్ లోని బిర్ వెళ్లాల్సిందే. ఇక్కడ ప్యారాగ్లైడింగ్ చేయవచ్చు. అలాగే పర్వతాల మీద మంచు పడటాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. నాసిక్-మహారాష్ట్ర: ద్రాక్ష తోటల మధ్య బ్యాచిలరెట్టే పార్టీని జరుపుకోవాలలంటే నాసిక్ వెళ్లాల్సిందే. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోదగిన రకరకాల ఫొటోస్ మీకు దొరుకుతాయి. పుదుచ్చేరి ఫ్రెంచ్ ప్రభావిత ప్రాంతమైన పుదుచ్చేరి బ్యాచిలరెట్టే పార్టీకి కొత్తగా ఉంటుంది. ఈ ప్రాంతంలో రాత్రిపూట సైకిల్స్ తో సిటీ మొత్తం రౌండ్స్ కొడితే ఆ కిక్కే వేరు.