ఆరోగ్యం: కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేయాల్సిన యోగాసనాలు
రక్తంలోని వ్యర్థాలను మూత్రపిండాలు బయటకు పంపించివేస్తాయి. అలాగే బీపీని కంట్రోల్ లో ఉంచడంలో మూత్రపిండాలు కీలక పాత్ర వహిస్తాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు అలవాట్లు మొదలగు కారణాల వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రస్తుతం మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏయే యోగాసనాలు వేయాలో చూద్దాం. సేతు బంధాసనం: ముందుగా వెల్లకిలా పడుకుని మోకాళ్ళను వంచి కాలి మడమలు పిరుదులకు తాకేలా చూడాలి. ఇప్పుడు నేలకు సమాంతరంగా తాకించి నడుము భాగాన్ని పైకి లేపాలి. ఈ పొజిషన్ లో ఒక బ్రిడ్జి లాగా మీ శరీర ఆకృతి కనిపించాలి. ఈ పొజిషన్ లో కొద్దిసేపు ఉండి రిలాక్స్ అవ్వాలి.
మూత్రపిండాల ఆరోగ్యాన్ని బాగు చేసే ఆసనాలు
భుజంగాసనం: బోర్లా పడుకుని అరచేతులను రొమ్ము భాగానికి రెండు పక్కలా నేలకు ఆనించి నడుము భాగం నుండి పైకి లేవాలి. నడుము కింది భాగాన్ని పైకి లేపకూడదు. ఇలా 15-30సెకన్ల పాటు ఉన్న తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి. నౌకాసనం: ముందుగా కాళ్ళను ముందుకు చాపి కూర్చోండి. అలా చాపిన కాళ్ళను నెమ్మదిగా పైకి లేపండి. చేతులను కాళ్ళవైపు చాపండి. ఈ పొజిషన్ లో మీ పిరుదులు మాత్రమే నేలమీద ఉండాలి. ఇలా 20-30సెకన్లు చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి. పశ్చిమోత్థాసనం: కాళ్ళను ముందుకు చాపి కూర్చోండి. ఇప్పుడు నడుము నుండి పై భాగాన్ని కాళ్ళమీదకు తెచ్చేలా వంగండి. చేతులతో కాలి బొటనవేలిని పట్టుకుని మీ రొమ్ముభాగం తొడలకు తగిలేలా చేయండి.