LOADING...
Stressful Indian city: భారత్'లో స్ట్రెస్ ఎక్కువగా ఉన్న నగరం ఏదంటే..?
భారత్'లో స్ట్రెస్ ఎక్కువగా ఉన్న నగరం ఏదంటే..?

Stressful Indian city: భారత్'లో స్ట్రెస్ ఎక్కువగా ఉన్న నగరం ఏదంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని మెట్రో నగరాల్లో ప్రయాణాలు చేస్తూ ఒత్తిడిగా ఫీలవుతున్నారా..? తాజాగా రెమిట్లీ (Remitly)విడుదల చేసిన గ్లోబల్ అధ్యయనంలో దేశంలోనే అత్యంత ఒత్తిడికరమైన నగరంగా కోల్‌కతా నిలిచింది. 10కి గాను 6.89 స్కోర్ సాధించిన కోల్‌కతా,ప్రపంచంలోని టాప్ 10 అత్యంత స్ట్రెస్ ఉన్న నగరాల జాబితాలో చోటు సంపాదించుకుంది. సాంస్కృతిక వైభవం, సాహిత్యం, వారసత్వ కట్టడాలు,స్ట్రీట్ ఫుడ్‌కు పేరున్న ఈ నగరం ఇప్పుడు పట్టణ జీవన ఒత్తిడితో వార్తల్లోకెక్కింది. అధ్యయనం ప్రకారం,కోల్‌కతాలో కేవలం 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి సగటున 34 నిమిషాలు 33 సెకన్లు పడుతోంది. అంటే చిన్న ప్రయాణమే సహనానికి పరీక్షగా మారుతోంది. జీవన వ్యయ సూచీ 19.6గా నమోదై, ఆహారం, కరెంట్, రవాణా వంటి అవసరాల ధరలు పెరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనం.

వివరాలు 

స్కోర్ ఎంత ఎక్కువైతే, అక్కడ జీవితం అంత ఒత్తిడి

ఆరోగ్య సేవల సూచీ 60గా ఉండటంతో వైద్య సేవలు మోస్తరు స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తేలింది. అలాగే క్రైం ఇండెక్స్ 46గా ఉండి, నగర భద్రతపై కొంతమేర ఆందోళన ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 170కి పైగా ప్రధాన నగరాలను పరిశీలించి ఈ ర్యాంకింగులను రూపొందించారు. ప్రయాణానికి పడే సమయం, జీవన వ్యయం, వైద్య సేవల నాణ్యత, నేరాల స్థాయి, వార్షిక వాయు కాలుష్యం వంటి ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతీ నగరానికి 10లోపు స్కోర్ నిర్ణయించారు. స్కోర్ ఎంత ఎక్కువైతే, అక్కడ జీవితం అంత ఒత్తిడిగా ఉంటుందన్నమాట. లాటిన్ అమెరికాలో భద్రత పెద్ద సమస్యగా మారగా, యూరప్‌, ఉత్తర అమెరికాలో ఎక్కువ ఖర్చులే ప్రధాన కారణంగా మారుతున్నాయని అధ్యయనం వెల్లడించింది.

వివరాలు 

 ప్రపంచ టాప్ 10 స్ట్రెస్ నగరాల జాబితాలో కోల్‌కతా చోటు 

భారతదేశంలో సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన కోల్‌కతానే ప్రపంచ టాప్ 10 స్ట్రెస్ నగరాల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. వేగంగా విస్తరిస్తున్న నగరం,ట్రాఫిక్‌తో నిండిన రోడ్లు,పెరుగుతున్న ఖర్చులు ఇవన్నీ ఒత్తిడిని ఏటేటా పెంచుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికుల దృష్ట్యా మాత్రం కోల్‌కతాను దూరంగా పెట్టాల్సిన అవసరం ఏమీ లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఆ నగరంలో ఉన్న ఉత్సాహం,చరిత్ర,ప్రత్యేక వాతావరణం ఇప్పటికీ అద్వితీయమే. అయితే అక్కడకు వెళ్లే వారు నిదాన ప్రయాణాలు,రద్దీ వీధులు, రోజువారీ జీవనంలోని గందరగోళానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఈ ర్యాంకింగ్ కోల్‌కతా ప్రజల సహనం, పోరాట స్ఫూర్తిని మరోసారి బయటపెట్టింది. ఎన్నో సవాళ్ల మధ్య తమ సాంస్కృతిక హృదయాన్ని సజీవంగా ఉంచుకుంటూ ముందుకు సాగుతున్న నగరంగా కోల్‌కతా కొనసాగుతోంది.

Advertisement